Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IndiaFightsCorona: The father died but the duties were not human. . . NATICANS HATESOP TO IAS OFFICER

IndiaFightsCorona : తండ్రి మరణించినా విధులు మానలేదు . . . IAS ఆఫీసర్ కి నెటిజన్ల హ్యాట్సాప్.
IndiaFightsCorona: The father died but the duties were not human. . . NATICANS HATESOP TO IAS OFFICER

IndiaFightsCorona | Covid 19 : ఓవైపు తండ్రి చనిపోతే . . . ఎవరైనా వెళ్లకుండా ఉద్యోగ విధులు నిర్వహించగలరా ? అందుకే ఆ IAS ఆఫీసర్ కి ఇండియన్ యూత్ తోడుగా నిలుస్తోంది . మీరే మాకు రోల్ మోడల్ అంటోంది .

IndiaFightsCorona | Covid 19 : ఇండియాను కబళిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రధాని నరేంద్రమోదీ, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటూ... ప్రజలు కూడా బలంగా పోరాడుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రేరణాత్మక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశా... భువనేశ్వర్‌లో... IAS ఆఫీసర్ నికుంజా ధల్... రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అలా ఆయన బిజీగా ఉండగా... ఉన్నతాధికారులు ఆయన దగ్గరకు వచ్చి... ఎలా ఉన్నారు... అని అడిగారు. బాగోగులు అడుగుతూనే... వెన్నుతట్టి... ఓదార్చుతుంటే... ఏమైంది సార్ అని అడిగారాయన. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి... అంటూ "మీ నాన్నగారు..." అని తండ్రి చనిపోయిన విషయం చెప్పారు. అంతే... నికుంజా ధల్ షాక్ అయ్యారు. నోట్లోంచీ మాటలు లేవు. ఇంటికి వెళ్లండి అని అధికారులు చెప్పడంతో... అప్పటివరకూ చేస్తున్న విధులను మిగతా వారికి తాత్కాలికంగా అప్పగించి... ఇంటికి వెళ్లారు. ఇల్లంతా విషాదం. తండ్రి మరణంతో... నికుంజా ఆ ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంప్రదాయం ప్రకారం ఏమేం చెయ్యాలో అన్నీ చేశారు. 24 గంటలు కూడా గడవలేదు. "ఏడుస్తూ ఉంటే... నాన్న తిరిగిరారు. నేను విధుల్లో పాల్గొని... కరోనా సోకకుండా ప్రజలకు సేవ చేస్తే... నాన్న ఎక్కడున్నా సంతోషిస్తారు" అనుకుంటూ... నికుంజా తిరిగి బయల్దేరారు. ఆఘమేఘాలపై వెళ్లి... విధుల్లో చేరిపోయారు. వెంటనే ఈ విషయం పై అధికారులకు తెలిసింది. "అవునా... అప్పుడే వచ్చేశారా... కనీసం మూడ్రోజులైనా సెలవులో ఉంటారని అనుకున్నాం. గ్రేట్... హ్యాట్సాప్ టు హిమ్" అంటూ మెచ్చుకున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IndiaFightsCorona: The father died but the duties were not human. . . NATICANS HATESOP TO IAS OFFICER"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0