Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Janata curfew across the country on Sunday: Modi New Guidelines for the Corona

ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు : ప్రధాని మోదీ
Janata curfew across the country on Sunday: Modi New Guidelines for the Corona


  • దేశంలో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీ అన్నారు. కరోనాపై మాట్లాడిన మోదీ.. దేశ ప్రజలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
  • నేను ఎప్పుడు అడిగిన దేశ ప్రజలు కాదనకుండా చేశారు. నేను ఈసారి కూడా మిమ్మల్ని కొన్ని అడగాలని అనుకుంటున్నాను.. అది మీ జీవితంలో రాబోయే రెండు మూడు వారాలు నాకు కావాలి.
  • కరోనా వ్యాప్తి కూడా అంతకంతకూ పెరుగుతోంది. వివిధ దేశాల ప్రజలు కరొనాను ధైర్యంగా ఎదుర్కొన్నారు. భారతీయులందరు కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలి
  • కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తయారు కాలేదు.
  • ప్రపంచం మొత్తం కరొనాతో పోరాడుతోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు, అందరం చేయి చేయి కలిపి ఈ మహమ్మారిని ఎదుర్కొందాం.
  • ఈ విషయంలో భారత ప్రజల పాత్ర చాలా కీలకమైనది, కరోనా కట్టడికి అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
  • దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్ప బలాన్ని మరింత పెంచుకోవాలి, తమకు కరోనా అంటకుండా, అలాగే ఇతరులకు కూడా కరోనా అంటకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.
  • రానున్న కొద్ది వారాలు కీలకమన్న మోదీ ఇప్పుడున్న కరోనా కంటే పెద్ద సమస్య లేదని వెల్లడించారు. వీలైనంత వరకు ప్రజలు తమ ఇంటినుంచి పనులు చేసుకోవాలని సూచించారు.
  • అలాగే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు తమ ఇళ్లనుంచి బైటికి వెళ్లరాదని సూచించారు. సమూహాలకు దూరంగా ఉండాలని సూచించారు.
  • ఏకాంతంగా ఉంటే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు అని తెలిపారు.
  • మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దని.. ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు.

కరోనా

  • ప్రధాని మోదీ ప్రసంగంలో ‍ కొన్ని అంశాలు
  • భారత్‌ పై  కరోనా ప్రభావం లేదనుకోవడం తప్పు.
  • గ్రూపులుగా తిరగవద్దు. స్వీయ నియంత్రణ అవసరం.
  • సామూహిక కార్యక్రమాలకు దూరంగా వుండండి.
  • కుటుంబంలోని సీనియర్ సిటిజన్లందరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దు
  • చాలా అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని దేశ ప్రజలందర్ని కోరుతున్నాను.
  • ఇంటి నుండే అన్ని పనులు చక్క బెట్టుకోండి.
  • కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంలో సామాజిక దూరం చాలా ముఖ్యమైంది.
  • మార్చి 22 ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ఉదయం 7 గంటలనుంచి  రాత్రం 9గంటల వరకు దీన్ని పాటిద్దాం.
  • 5 సాయంత్రం గంటలకు అందరూ బైటికి వచ్చి 5 నిమిషాలు చప్పట్లు కొట్టండి.
  • కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా కృషి చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతగా ఇలా చేయాలి.
  • నిత్యావసరాలు, అత్యవసర మందుల కొరత రాదు,  ఈ విషయంలో ప్రజలకు ఆందోళన అవసరం లేదు.
  • వైద్య, శానిటేషన్‌ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు
  • కేంద్రం ప్రభుత్వం నిర్దేశించిన మార్గ దర్శకాలను తప్పకుండా పాటించాలి.
  • కరోనావైరస్ నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో కోవిడ్‌-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • అనేక కష్టసమయాల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇపుడు కూడా ఇలాంటి సంయమనాన్నే ప్రజలు పాటించాలి.
  • కరోనా మహమ్మారిపై  మానవజాతి తుది విజయం సాధించాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Janata curfew across the country on Sunday: Modi New Guidelines for the Corona"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0