Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Local Election Effect on Job Calendar .. APPSC and DSC interrupted


  • జాబ్‌ క్యాలెండరుకు ‘స్థానిక’ ఎఫెక్ట్‌..
  • ఏపీపీఎస్సీ, డీఎస్సీలకు ఆటంకం
  • నిరుద్యోగుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..
  • కొనసాగుతున్న జాప్యం

Local Election Effect on Job Calendar ..  APPSC and DSC interrupted

 రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్‌సిగల్‌ ఇవ్వడంతో జాబ్‌ క్యాలెండరు మరింత జాప్యమయ్యే అవకాశముంది. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా పూర్తిగా సమాయా త్తమవ్వడంతో జాబ్‌ క్యాలెండరు విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందైనా ప్రభు త్వం జాబ్‌ క్యాలెండరును విడుదల చేస్తుందన్న నిరుద్యో గుల ఆశలపై నీళ్లు జల్లింది. ప్రతి ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండరును విడుదల చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. ఆ దిశగా నిరుద్యోగులంతా మూడు నెలల నుంచి ఎంతో ఆశతో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వేలాది రూపా యలు వెచ్చించి ప్రైవేట్‌ సంస్థల్లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నారు. జాబ్‌ క్యాలెండరులో ప్రధానంగా ఏపీపీఎస్సీ నుంచి వివిధ కేటగిరీలకు చెందిన దాదాపు 25 వేలు, డీఎస్సీ(ఉపాధ్యాయ నియామకాలు) నుంచి 15 వేల పోస్టులున్నాయి. వాటితోపాటు విశ్వవిద్యాలయాలు పరిధి లోని ప్రొఫెసర్లు, గెజిటెడ్‌ ఆఫీసర్లు, క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు వేచిస్తు న్నారు. జనవరి నుంచి మార్చి (గ్రామ సచివా లయాలు-2) మినహా ఏపీపీఎస్సీ, డీఎస్సీ నుంచి నోట ిఫికేషన్లకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.
స్థానికం తర్వాతే టెట్‌, డీఎస్సీ..!
స్థానిక ఎన్నికల తర్వాతే టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలున్నాయి. ఏప్రిల్‌ మొదటి వారంలోగాని, చివరి వారంలోగాని ముందస్తుగా టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి, ఆ తర్వాత 45 రోజుల గ్యాప్‌తో డీఎస్సీ-2020కి ప్రభుత్వం సిద్ధమవుతుందని సమాచారం. జాబ్‌ క్యాలెండరులో కీలకమైన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఏప్రిల్‌లోనే వెలువడే అవకాశముంది. ఈ వాయిదాలతో సీరియస్‌ ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్న అభ్యర్థులు నష్టపోయే ప్రమాదముంది.
నిరుద్యోగులకు తీరని నష్టం
జనవరిలో విడుదల చేయాల్సిన జాబ్‌ క్యాలెండరును స్థానిక ఎన్నికల కారణంగా నిలుపుదల చేస్తే, వేలాది మంది నిరుద్యోగులు అన్యాయానికి గురవుతారు. వయోపరిమితి మించిపోయి వేలాది మంది అనర్హులయ్యే ప్రమాదముంది. ప్రైవేటు ఉద్యోగాలను సైతం వదులుకుని శిక్షణ తీసుకుంటున్న వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. అటు ఉన్న ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతారు. నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఈ సందర్భంగా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Local Election Effect on Job Calendar .. APPSC and DSC interrupted"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0