A new method for distributing pensions in the AP
ఏపీలో పెన్షన్ల పంపిణీకి కొత్త పద్దతి
వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్దమయిందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు అందించనున్నట్టు ఆయన తెలిపారు. అంత మందికి పెన్షన్లు అందించేందుకు 1421.20 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే గ్రామ, వార్డు కార్యదర్శుల ఖాతాల్లోకి సొమ్ము జమ అయిందని ఆయన పేర్కొన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షనర్ల చేతికే పెన్షన్ సొమ్ము అందిస్తామని ఆయన అన్నారు. పెన్షన్ల పంపిణీలో 2,37,615 మంది వాలంటీర్లు పాల్గొనబోతున్నారని ఆయన తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రత్యేక మొబైల్ యాప్ క్రియేట్ చేశామని దాని ద్వారా బయోమెట్రిక్ కు బదులు పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే లాక్ డౌన్ వల్ల వేరే ప్రాంతాల్లో వున్న వారికి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
0 Response to "A new method for distributing pensions in the AP"
Post a Comment