Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EPF Claim: Didn't EPF Withdraw? Like compliant

EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రా డబ్బులు రాలేదా? కంప్లైంట్ చేయండి ఇలా
EPF Claim: Didn't EPF Withdraw? Like compliant

  • EPF Pandemic Advance Facility  మీరు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు దరఖాస్తు చేశారా? మీ క్లెయిమ్ సెటిల్మెంట్‌లో ఏవైనా సమస్యలున్నాయా? అయితే ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకోండి.
  • 1. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీ ద్వారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO.
  • 2. పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న మొత్తంలో 75 శాతం లేదా, మూడు నెలల బెసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే 4 లక్షల క్లెయిమ్స్ వచ్చాయి. వాటిలో 1.37 లక్షల క్లెయిమ్స్ ప్రాసెస్ అయ్యాయి.
  • 3. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడంలో ఖాతాదారులు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ చేయడంలో సమస్యలు వచ్చినా, అప్లై చేసినా డబ్బులు అకౌంట్‌లోకి రాకపోయినా https://epfigms.gov.in/ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
  • 4. పీఎఫ్ ఖాతాదారుల ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ రూపొందించిన ప్లాట్‌ఫామ్ ఇది. ఇందులో ఫిర్యాదు చేస్తే నేరుగా సంబంధిత అధికారుల దగ్గరకు మీ కంప్లైంట్ వెళ్తుంది. మీ ఫిర్యాదును ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోండి
  • 5. ముందుగా https://epfigms.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో Register Grievance పైన క్లిక్ చేయాలి. PF Member, EPS Pensioner, Employer, Others ఆప్షన్‌లో మీ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • 6. మీ యూఏఎన్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. Get OTP పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
  • 7. ఆ తర్వాత మీ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. మీ సమస్యను వివరించాలి. ఏదైనా డాక్యుమెంట్ ఉంటే అప్‌లోడ్ చేయాలి. చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. కంప్లైంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ ఇమెయిల్ ఐడీకి, మొబైల్ నెంబర్‌కు వస్తుంది.
  • 8. మీ కంప్లైంట్ స్టేటస్‌ని చెక్ చేసేందుకు https://epfigms.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. View Status ఆప్షన్ పైన క్లిక్ చేయండి
  • 9. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, కంప్లైంట్ నెంబర్, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసి మీ కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "EPF Claim: Didn't EPF Withdraw? Like compliant"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0