Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Blockage on Tenth Class Examinations Alternative ways are inevitable.

 పదవ తరగతి పరీక్షల పై ప్రతిష్టంభన. 
ప్రత్యామ్నాయ మార్గాలు అనివార్యం.        కరోనా ముప్పు లేకుండానిర్వహించవచ్చు. ముఖ్యమంత్రికి బీసీ ఇంటర్నేషనల్ సంఘం సూచన.
Blockage on Tenth Class Examinations  Alternative ways are inevitable.

 అమరావతి , ఏప్రిల్18 ( మనం న్యూస్ బ్యూరో ) : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు సంబంధించి సందిగ్ధత నెలకొంది . ఇప్పటికే ఏపిలో జరగాల్సిన పదవ తరగతి  పబ్లిక్ పరీక్షలు కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడడంతో అయోమయం నెలకొంది . ఈ సందర్భంగానే ఒక వైపు లాక్ డాన్ నడుస్తుండగా మరోవైపు ఏ విధంగా ముందుకు సాగాలనే విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోలేక రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది . ఈ నేపథ్యంలోనే బిసి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అధ్యక్షుడైన ఎన్ . వి . రావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డికి పలు సూచనలు చేగారు . పరీక్షల నిర్వహణలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించాల్సిందిగా ఆయన ప్రత్యేకంగా సీఎంను కోరారు . ఈ రంగంలో తనకు ఉన్న అనుభవంతో కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగే విధంగా తాను సూచనలు ఇస్తున్నట్టు ,       విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు కరోనా ముప్పు ఎక్కువగా లేకుండా పరీక్షలు నిర్వహించవచ్చునేమో పరిశీలించవలసిందిగా ఎన్. వి. రావు కోరారు . వాస్తవానికి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను 11 రోజులపాటు 11 పరీక్షలు నిర్వహిస్తారని ఆయన గుర్తుచేశారు . కరోనా వల్ల ఇది సాధ్యం కానట్లైతే మరొక ప్రత్యామ్నాయ పద్ధతిని ఆయన ముఖ్యమంత్రి ముందు ఉంచుతున్నారు . 11 పరీక్షలను 11 రోజులకు బదులు కానీ , 6 రోజులు నిర్వహించాలని ఆయన సూచించారు . అంతేకాకుండా కానీ ఈ పరీక్షలను సబ్జెక్టు వారీగా నిర్వహించిన పక్షంలో కరోనా వలన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఎక్కువ ముప్పు లేకుండా నిర్వహించే విషయం పరిశీలించవలసిందిగా ఆయన కోరారు . వాస్తవానికి సున్నితమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల అంశం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో ముడిపడి ఉన్నదని తలిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు . కరోనా వైరలో ప్రతిష్ఠంభన ఏర్పడిన మాట నిజమేనని అన్నారు . కానీ ఇప్పటికిప్పుడు కరోనా వైరస్ నివారణపై స్పష్టత వచ్చే అవకాశాలు లేకపోవడంతో పరీక్షల నిర్వహణపై ప్రత్యామ్నాయ పద్దతులను ఆలోచించాల్సిందేనని తమ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్విరావు ముఖ్యమంత్రిని కోరారు .                                                                         

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Blockage on Tenth Class Examinations Alternative ways are inevitable."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0