Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Live program for Hon'ble Prime Minister's speech on Kovid-19

Live program for Hon'ble Prime Minister's speech on Kovid-19.

Live program for Hon'ble Prime Minister's speech on Kovid-19.




VIEW THE LIVE VIDEO


మే 3 వరకు భారత్ లో లాక్ డౌన్  
కరోనా వైరస్ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే… 

“కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దేశ ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు. ప్రజల కష్టాలను నేను అర్దం చేసుకోగలను. కానీ తప్పదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశాన్ని రక్షించారు. దేశం కోసం ప్రజలు సైనికుల్లా పని చేస్తున్నారు. కరోనా పై భారత్ బలంగా పోరాడుతుంది. కరోనా పై పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. లాక్ డౌన్ ను తట్టుకుంటూ ప్రజలు దేశాన్ని రక్షించారు. దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కరోనా పై సైనికుడిలా పని చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నాయి. 

దేశమంతా కరోనా పై పోరులో ఏకతాటి పై ఉంది. 21 రోజుల లాక్ డౌన్ ను ప్రజలు సంపూర్ణంగా విజయవంతం చేశారు. కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ పోరాటంలో ప్రజల సహకారం మరవలేనిది. కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి వేగంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఇతర దేశాలతో పోల్చితే మనం చాలా మెరుగ్గా ఉన్నాం. కరోనా మహమ్మారిలా మారక ముందే కఠిన చర్యలు చేపట్టాం. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ ద్వారా మనం చాలా లాభపడ్డాం. లాక్ డౌన్ సంతృప్తికరంగా అమలవుతుంది. 


కరోనా పై పోరులో మన సరైన మార్గంలో వెళుతున్నాం. మన దేశంతో పోల్చితే ఇతర దేశాల్లో 25 నుంచి 30 శాతం కేసులు ఎక్కువగా ఉన్నాయి. మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం. దయచేసి ప్రజలు సహకరించాలి. దేశ వ్యాప్తంగా కేసులు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ 19 రోజుల లాక్ డౌన్ పొడిగింపుకు అంతా సహకరించాలి." అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Live program for Hon'ble Prime Minister's speech on Kovid-19"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0