Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central government restricts cash withdrawals in Jandhan accounts

జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు విత్‌డ్రాపై కేంద్రం ఆంక్షలు
Central government restricts cash withdrawals in Jandhan accounts

దిల్లీ: జన్‌ధన్‌ మహిళల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు ఈ ఆంక్షలు పెట్టింది.

 బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీగా గుమిగూడే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు.. ఖాతా చివరన 0 లేక 1 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 3న నగదు ఉపంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు.

 అలాగే, ఖాతా చివరన 2 లేదా 3 అంకె ఉన్నవాళ్లయితే ఈ నెల 4న, ఖాతా చివరన 4 లేక 5 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 7న; అలాగే, ఖాతా చివరన 6లేక 7 సంఖ్య ఉన్నవాళ్లయితే ఈ నెల 8న, ఎనిమిది లేదా 9 అంకె ఉన్నవాళ్లు అయితే ఈ నెల 9న నగదును ఉపసంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 9 లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తర్వాతైనా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ ఖాతాల్లో 3 నెలల పాటు రూ.500 చొప్పున  జమచేస్తున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో జన్‌ధన్‌ఖాతాదారుల సంఖ్య 1,18,55,366 ఉండగా.. తెలంగాణలో 52,23,218 మంది ఖాతాదారులు ఉన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central government restricts cash withdrawals in Jandhan accounts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0