Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

An explanation of how much loss the eMI postponed for three months

EMI మూడు నెలలు వాయిదా వేస్తే ఎంత నష్టమో వివరణ .
An explanation of how much loss the eMI postponed for three months

దేశంలో కరోనా కారణంగా ప్రజల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ఈఎంఐల చెల్లింపులపై 3 నెలల వెసులుబాటు కల్పించింది ఆర్బీఐ. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని భావిస్తున్నారా? ఈ నిర్ణయం తాత్కాలికంగా ఊరట కలిగించినా.. దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో ముందుగా తెలుసుకోండి..

దేశంలో లాక్ డౌన్ దృష్ట్యా రుణాల నెలవారీ సులభ వాయిదాలు (ఈఎంఐ), వడ్డీ బకాయిలపై 3 నెలల మారటోరియం విధించింది ఆర్బీఐ. ఈ సౌలభ్యం రుణగ్రహీతలకు తాత్కాలిక లాభం చేకూర్చినా.. దీర్ఘకాలంలో కొంత ఇబ్బంది ఉంటుంది.

ఆర్బీఐ మార్గదర్శకాల నేపథ్యంలో దేశంలో వివిధ బ్యాంకులు మారటోరియం పథకాలను ప్రకటించాయి. వీటిని పరిశీలిస్తే మారటోరియం కాలానికి వడ్డీ కట్టాల్సి ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

రెండు వైపులా కష్టాలే..

ఈ పరిస్థితులను చూస్తుంటే రుణగ్రహీతలకు ఒకేసారి రెండు కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా కారణంగా ఆదాయాలు దెబ్బతినగా.. మారటోరియాన్ని ఎంచుకుంటే ఈఎంఐ కాలవ్యవధి పెరిగి వడ్డీ ఎక్కువవుతుంది.

దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్​బీఐ ఈ విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా చెప్పింది. మారటోరియం ఎంచుకున్న వారికి 3 నెలల కాలంలోనూ తీసుకున్న అసలుపై వడ్డీ పెరుగుతూనే ఉంటుందని తెలిపింది. ఈ వడ్డీ మొత్తాన్ని అదనపు ఈఎంఐల ద్వారా రుణదాతలకు వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విషయం అర్థమయ్యేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.

  • మీరు రూ.30 లక్షలు గృహ రుణంగా తీసుకున్నారు. ఇంకా 15 ఏళ్లు ఈఎంఐలు కట్టాల్సి ఉంది. అప్పుడు మీకు అదనంగా పడే వడ్డీ రూ.2.34 లక్షలు. అంటే 8 ఈఎంఐలతో సమానం.
  • మీ వాహనంపై తీసుకున్న లోను రూ.6 లక్షలు. ఇంకా 54 నెలల ఈఎంఐ మిగిలి ఉంది. అప్పుడు మీపై పడే అదనపు వడ్డీ రూ.19 వేలు. ఇది ఒకటిన్నర ఈఎంఐకి సమానం.
  • మీరు రూ.లక్ష వ్యక్తిగత రుణం కింద తీసుకున్నారు. వడ్డీ రేటు 12 శాతం. అంటే నెలకు రూ.1000 వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ 3 నెలలు మీరు కట్టకపోయినట్లయితే మీపై రూ.3,030.10 అదనపు భారం పడుతుంది.

ఏది ఉత్తమం..

ఈఎంఐ చెల్లింపులను వాయిదా వేయాలనుకునేవారు జాతీయ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్)ను సంప్రదించాలని ఎస్​బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ మెయిల్ ఐడీకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందుకు సంబంధించిన మెయిళ్ల జాబితాను ఎస్​బీఐ విడుదల చేసింది.

ఈఎంఐ వాయిదా వద్దనుకున్నవాళ్లు యథావిధిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయాలపై ప్రభావం లేని వారు వాయిదాలను సమయానికి చెల్లించాలని భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) స్పష్టం చేసింది.

"కరోనా వల్ల ఆదాయం కోల్పోయినట్లయితే ఈ అవకాశాన్ని ఎంచుకోండి. లేదంటే యథావిధిగా ఈఎంఐలు చెల్లించండి. ఈ 3 నెలల కాలంలో మీపై అదనపు వడ్డీ భారం పడుతుందని గుర్తుంచుకోండి. "

- భారతీయ బ్యాంకుల సంఘం

క్రెడిట్ కార్డు విషయానికి వస్తే కనీస మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉంటుందని ఐబీఏ స్పష్టం చేసింది. లేదంటే క్రెడిట్ సంస్థలకు ఈ సమాచారం చేరుతుంది. కానీ ఆర్బీఐ తాజా ప్రకటన ప్రకారం.. మీరు కనీస మొత్తం చెల్లించకపోయినా క్రెడిట్ సంస్థలకు ఈ వివరాలు చేరవని తెలిపింది.

"చెల్లింపులు చేయకపోతే కట్టని మొత్తంపై క్రెడిట్ కార్డు సంస్థలు వడ్డీని ఛార్జ్ చేస్తాయి. వడ్డీ రేట్లకు సంబంధించి మీకు కార్డు అందించిన వారిని సంప్రదించాలి. సాధారణ బ్యాంకుల రుణాల కన్నా క్రెడిట్ కార్డు రుణాల వడ్డీ రేటు చాలా ఎక్కువ అనే విషయం గుర్తుంచుకోవాలి. "

-భారతీయ బ్యాంకుల సంఘం

బ్యాంకులకే అధికారం..

కరోనా నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించేందుకు ఈఎంఐలపై మారటోరియం విధించేందుకు బ్యాంకులకు మార్చి 26న ఆర్బీఐ అనుమతించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించుకునేందుకు రుణదాతలకే అవకాశం ఇచ్చింది.

ఈ మేరకు మారటోరియాన్ని అంగీకరిస్తూ పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్గదర్శకాలు విడుదల చేశాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ వంటి సంస్థలు తాజా 3 నెలల వెసులుబాటును ఆమోదించాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "An explanation of how much loss the eMI postponed for three months"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0