Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Changes in the education sector due to lockdown. Delay in the academic year

లాక్ డౌన్ కారణంగా  విద్యా రంగంలో మార్పులు.


విద్యా సంవత్సరంలో ఆలస్యం!
  • కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దీంతో అన్ని రకాల షాపులు, వ్యాపారాలు మూతబడ్డాయి.
  • ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు ముందుగానే మూసేశారు.స్కూల్స్‌, కాలేజీలు బంద్‌ అయ్యాయి. ఇంకా ఎగ్జామ్స్‌ జరగాల్సి ఉంది. కరోనా ప్రభావం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంపై పడింది.
  • పదవ తరగతి, డిగ్రీ ఇంజినీరింగ్‌, పిజి పరీక్షలు ఏప్రిల్‌లో జరగాలి. లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఈ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సిలబస్‌ కూడా పూర్తికాలేదు.
  • రాష్ట్రస్థాయితోపాటు జాతీయ స్థాయిలో జరగాల్సిన పలువార్షిక, ప్రవేశపరీక్షలూ వాయిదాపడ్డాయి.
  • లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఈ పరీక్షల షెడ్యూలు ప్రకటించాలి.
  • పరీక్షలు నిర్వహించాలి. ఫలితాలు విడుదల చేయాలి. ఆ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
  • ఏటా మార్చి నుంచి జూలై వరకు విద్యా రంగానికి ఎంతో కీలకం. సరిగ్గా ఆ సమయంలోనే కరోనా కల్లోలం ప్రారంభం కావడం విద్యావ్యవస్థకు పెనుశాపంగా మారింది.
  • ఇక, నూతన విద్యా సంవత్సరానికి ముఖ్యమైన ఎంసెట్‌, జెఇఇ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షలూ వాయిదా పడ్డాయి. ఇంకా పది పరీక్షలను నిర్వహించి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది.
  • ఇందుకు 45 రోజుల సమయం పడుతుంది. ఇంటర్‌ పరీక్షలు జరిగినా మూల్యాంకనం ప్రారంభంకాలేదు. ఇందుకు కనీసం 30 రోజులు అవసరం.
  • అంటే, మే ప్రారంభం నుంచే పనులను ప్రారంభిస్తే జూన్‌ ఆఖరులోపు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.ఇంటర్‌ ఫలితాలను వెల్లడించనిదే ఎంసెట్‌ ప్రారం భం కాదు.
  • మరోవైపు జెఇఇ మెయిన్‌, నీట్‌ పరీక్షలను మే లోనే నిర్వహిస్తామని ఇప్పటికే ఆయా సంస్థలు ప్రకటించాయి.
  • ఇంటర్‌ ఫలితాలతోనే జెఇఇ మెయిన్‌, నీట్‌ కౌన్సెలింగ్‌ ఆధార పడి ఉంటుంది.
  • ఇందుకు అనుగుణంగా పరీక్షలన్నీ మేలోనే పూర్తిచేసి జూన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఆయా సంస్థ లు ప్రణాళికలు రూపొందించాయి.
  • ఇదంతా, కరోనా అదుపు లోకి వస్తే జరిగే పరిణామాలు మాత్రమే. అయితే, పరీక్షలు జరుగుతాయా? జరిగితే ఎప్పుడు? అన్న గందరగోళంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

వచ్చే విద్యా సంవ త్సరం ఆలస్యంగా ప్రారంభం కానుంది.

పరీక్షలు పూర్తి కాకపోవడం, లాక్‌డౌన్‌ తర్వాత, పరీక్షలు నిర్వహణకు, పేపర్ల వాల్యుయేషన్‌, ఫలితాల వెల్లడి కోసం రెండు నెలల సమయం పడుతుంది.

జూన్‌, జూలైలో ఆలస్యంగా ప్రారంభం

  • పరీక్షలు పూర్తి కాకపోవడం, లాక్‌డౌన్‌ తర్వాత, పరీక్షలు నిర్వహణకు, పేపర్ల వాల్యుయేషన్‌ ఫలితాల వెల్లడి కోసం రెండు నెలల సమయం పడుతుంది.
  • దీన్ని బట్టి జూన్‌, జూలైలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశాలు లేవు,. వచ్చే విద్యా సంవత్సరం ఆలస్యం తప్పదు.
  • కరోనా అదుపులోకి వస్తే వాయిదా పడిన పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.
  • లేదంటే ఇంకా కొన్నా ళ్లు ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. మేలో పదో తరగతి పరీక్షలను నిర్వహించి వాటి వాల్యుయేషన్‌ పూర్తిచేసి,ఫలితాలు ఇచ్చేటప్పటికి జూన్‌ రెండోవారం వస్తుంది.
  • అప్పుడు ఇంటర్‌ ప్రవేశాలు చేపట్టి తరగతులు మొదలు పెట్టేసరికి జూలై వచ్చేస్తుంది.దీంతో ఇంటర్‌ విద్యా సంవత్స రంలో ఆలస్యం తప్పదు.
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు పూర్తయినప్పటికీ, పదవ తరగతి పరీక్షలు నిర్వహించ లేదు. ఈ పరిస్థితుల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.
  • తెలంగాణలో ఇప్పటికే కొన్ని పరీ క్షలుజరగగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరీక్షలు స్థానిక ఎన్నికలు కారణంగా ఒకసారి, కరోనా వైరస్‌తో మరోసారి వాయిదా పడ్డాయి.
  • కరోనా వైరస్‌ ముప్పు తప్పి దేశంలో సాధారణ పరిస్థితులు రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.
  • ఇప్పుడున్న విధానంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసేవిధంగా ఆబ్జెక్టివ్‌ విధానంలో పూర్తిచేసి జిపిఎ ప్రకటించాలి.
  • లేదా ప్రస్తుత విద్యాసంవత్సరానికి స్కూల్లో నిర్వహించిన ఎస్‌ఎ1, ప్రిఫైనల్‌ పరీక్షల నుంచి పదవతరగతి ఫలితాలు ఇచ్చేందుకు వీలవ్ఞతుం దా లాంటివి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.
  • కరోనా నేపథ్యంలో భవిష్యత్తులో పదవ తరగతి పరీక్షలు జరిపితే లక్షలాదిమంది విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు 11 రోజులపాటు ప్రయాణం చేయాలి.
  • వేలాది మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా, అధికారులు, సిబ్బంది. పోలీస్‌శాఖవారు ఇలా వేలాదిమంది సమన్వయంగా పనిచేయాల్సిఉంది.
  • ఇప్పటికే చైనా లాంటి దేశాల్లో కరోనా వైరస్‌ నియంత్రించబడినప్పటికీ మరలా తిరిగి కరోనా కేసులు నమోదు అవ్ఞతున్నాయి.
  • పరీక్షలు నిర్వహిస్తే ఈ తరుణంలో ఏ ఒక్క విద్యార్థినుండి అయినా, సిబ్బంది నుండి అయినా కరోనా వైరస్‌ అంటుకునే అవకాశాలు లేకపోలేదు.
  • ఇలా కనుక జరిగినట్లయితే వేలాది మందికి, వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే పరిస్థితులు రావొచ్చు.
  • కాబట్టి ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఫార్మేటివ్‌, సమేటివ్‌, ప్రిఫైనల్‌ లాంటి పరీక్షలు నిర్వహించి ఈ పరీక్షల గ్రేడింగ్‌ వివరాలు అన్నీ విద్యాశాఖ వైబ్‌సైట్‌ సి.ఎస్‌.ఈలో అప్లోడ్‌ చేశారు.
  • అన్ని పాఠశాల రికార్ట్స్‌ లో నమోదు చేశారు.
  • కనుక ఈ పరీక్షల సగటు ఆధారంగా విద్యార్థి సాంవత్సరిక గ్రేడింగ్‌ నిర్ణయించడం ద్వారా ఈవిద్యా సంవత్సరాన్ని పూర్తి చేసేవిధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి.
  • రెండు తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి లోపు చదువ్ఞతున్న విద్యార్థులకు పరీక్షలనురద్దుచేసి పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నారు
  • గనుక అలాంటి అవకాశం పదవ తరగతి చదువ్ఞతున్న విద్యార్థులకు కల్పిస్తే 10వ తరగతి చదువ్ఞతున్న విద్యార్థులకు వెసులుబాటు కలుగుతుంది.
  • కరోనా నేపథ్యంలో ఎటువంటి ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వాలు చెబుతున్నా విద్యాసంస్థలు ఫీజులు బకాయిలు చెల్లించాలని తొందరపెడుతున్నారు.
  • అన్లైన్‌ ఎగ్జామ్స్‌అంటూ హడావ్ఞడి చేస్తున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Changes in the education sector due to lockdown. Delay in the academic year"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0