Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Video Conferencing Highlights with Prime Minister Shri Narendra Modi Chief Ministers of State

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాషించారు, అభివృద్ధి చెందుతున్న పరిస్థితులపై చర్చించడానికి మరియు COVID-19 మహమ్మారిని పరిష్కరించడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించారు.
Video Conferencing Highlights with Prime Minister Shri Narendra Modi Chief Ministers of State


 ప్రధానమంత్రితో ప్రధాని జరిపిన నాల్గవ సంభాషణ ఇది, అంతకుముందు 2020 మార్చి 20, ఏప్రిల్ 2 మరియు 11 ఏప్రిల్ 11 న జరిగింది.

 దేశం లో లాక్ డౌన్ 3.0 ఖాయమే త్వరలో ప్రకటన

మే 3తో లాక్​డౌన్ గడువు తీరిపోనున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. లాక్​డౌన్ కొనసాగింపు అంశమై సీఎంల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే దేశంలో వైరస్ ఉద్ధృతి కారణంగా లాక్​డౌన్ కొనసాగింపునకే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశం ఉంది. సీఎంలు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రధానికి తెలిపారని సమాచారం.

కరోనా వ్యాప్తిని నియంత్రించే లక్ష్యంతో విధించిన లాక్​డౌన్​ను మరోమారు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు దఫాలుగా మొత్తం 40 రోజుల లాక్​డౌన్​ అమలు చేస్తున్నా.. కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని.. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎలా ఉంది? లాక్​డౌన్​ను కొనసాగించాలా వద్దా వంటి అంశాలపై సీఎంల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

"అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాను. మనం సంయుక్తంగా చేస్తున్న ప్రయత్నాలు కొంత ప్రభావాన్ని చూపుతున్నాయి. లాక్​డౌన్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని ఫలితాలు కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి. వేలాది మంది ప్రాణాలను రక్షించడంలో సామూహికంగా చేసే ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవి. రెండు దఫాలుగా లాక్‌డౌన్‌ను అమలు చేశాం. మొదటి దశ లాక్​డౌన్ అమలులో వచ్చిన అనుభవాలతో.... రెండోసారి ప్రకటించిన తర్వాత కొన్ని మినహాయింపులు తీసుకువచ్చాము. కరోనాపై పోరులో నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటూ కార్యాచరణ వైపు అడుగులు వేస్తున్నాం. మహాత్మాగాంధీ ఉపాధి హామి సహా కొన్ని పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయి."
:-ముఖ్యమంత్రులతో ప్రధాని


కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రధాని వెల్లడించారు. వైరస్ ప్రభావం తక్కువున్న రాష్ట్రాల్లో జిల్లాలవారీగా సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని సీఎంలకు చెప్పారు.
తొమ్మిదిమందికే మాట్లాడే అవకాశం
లాక్​డౌన్​ను మరోసారి పొడిగించాల్సిందేనని ప్రధానిని కోరారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. కరోనాను పూర్తి స్థాయిలో తరిమికొట్టేందుకు ఆంక్షల కొనసాగింపే ఏకైక మార్గమని మోదీకి వివరించారు. మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్‌, పుదుచ్ఛేరి, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, బీహార్‌, గుజరాత్‌, హర్యానా సీఎంలకు మాత్రమే మాట్లాడే అవకాశం వచ్చిందని సమాచారం. అందులో నలుగురు ముఖ్యమంత్రులు లాక్​డౌన్​ను కొనసాగించాలని పేర్కొన్నారని తెలుస్తోంది.
మరోమారు లాక్​డౌన్ దిశగానే..
వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో లాక్​డౌన్​ కొనసాగింపు అనివార్యమని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో లాక్​​డౌన్ కొనసాగింపు దిశగానే కేంద్రం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఒక్కసారిగా కాకుండా, దశలవారీగా ఆంక్షలను ఎత్తివేయాలన్నది మోదీ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Video Conferencing Highlights with Prime Minister Shri Narendra Modi Chief Ministers of State"

Post a comment