Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona Advance .. How to with Draw Cash

కరోనా అడ్వాన్స్.. క్యాష్ ను ఇలా విత్ డ్రా చేసుకోండి
Corona Advance .. How to with Draw Cash


కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. ఈ పరిణామం ప్రజల వ్యక్తిగత ఆదాయంపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వారికి కొంత రిలీఫ్ ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) తమ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఖాతాదారులందరికీ మొబైల్ ఫోన్ ద్వారా సందేశాలనూ పంపుతోంది.

లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది నిజంగా ఊరట కలిగించే నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలోని అన్ని సంస్థల ఉద్యోగులకు ఈ క్యాష్ విత్‌డ్రా అవకాశం ఉంటుంది. మీ ఖాతాలోని సొమ్ములో 75 శాతం లేదా మీ మూడు నెలల బేసిక్ సాలరీ, డీఏకు సమానమైన మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు. వీటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకుని నగదు ఉపసంహరణకు అనుమతిస్తారు.

ఉదాహరణకు మీ పీఎఫ్ ఖాతాలో రూ. 50వేల (ఉద్యోగి విరాళం, సంస్థ వాటా, వీటిపై వడ్డీ అంతా కలిపి) సొమ్ము ఉందనుకుందాం. మీ బేసిక్ సాలరీ, డీఏ నెలకు రూ.15వేలుగా ఉంది. అంటే మూడు నెలలకు రూ.45 వేలు అవుతుంది. ఖాతా సొమ్ము రూ. 50 వేలలో 75 శాతం అంటే రూ. 37, 500. దీంతో మీరు పీఎఫ్ అడ్వాన్స్‌గా ఈ రూ. 37,500 లనే ఉపసంహరించుకోవచ్చు.
మీకు ఈ విషయం తెలుసా?

  • 1. పీఎఫ్ ఖాతాలో నుంచి తీసుకున్న మొత్తాన్ని మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
  • 2. గతంలో ఏదైనా అవసరంతో నగదును ఉపసంహరించుకున్నవారూ మళ్లీ ఈ కరోనా అడ్వాన్స్ తీసుకోవచ్చు.
  • 3. ఈ అడ్వాన్స్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను ఈపీఎఫ్‌వోకు సమర్పించనవసరం లేదు.
  • 4. విత్‌డ్రా చేసుకున్న సొమ్ము ఆదాయం పన్ను పరిధిలోకి రాదు.

ఆన్‌లైన్‌లో విత్‌డ్రా విధానం:

  • 1.https://unifiedportalmem.epfindia.gov.in/memberinter faceలోకి లాగిన్ కావాలి.
  • 2. ఆన్‌లైన్ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత క్లెయిమ్ (మీకు అవసరమైన ఫాం-31, 19, 10సి మరియు 10డీ)ను క్లిక్ చేయాలి.
  • 3. మీ బ్యాంక్ ఖాతా నెంబర్‌లోని చివరి 4 అంకెలను ప్రవేశపెట్టాలి. దాన్ని ధ్రువపరుచుకోవాలి.
  • 4. ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్‌పై క్లిక్ చేయాలి.
  • 5. డ్రాప్ డౌన్ నుంచి పీఎఫ్ అడ్వాన్స్ (ఫాం 31)ను ఎంచుకోవాలి.
  • 6. డ్రాప్ డౌన్ నుంచి కరోనా వైరస్ ప్రభావం వల్ల అన్న నగదు ఉపసంహరణ కారణాన్ని ఎంచుకోవాలి.
  • 7. కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి. స్కాన్ చేసిన చెక్ కాపీని అప్‌లోడ్ చేయాలి. మీ చిరునామానూ ఎంటర్ చేయాలి.
  • 8. గెట్ ఆధార్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • 9. మీ ఆధార్ అనుసంధాన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
  • 10. క్లెయిమ్‌ను సమర్పించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona Advance .. How to with Draw Cash"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0