Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The details of Sim swap Scam

SIM SWAP: హైదరాబాద్‌లో సిమ్ స్వాప్ కలకలం... అసలేంటి ఈ మోసం?
The details of Sim swap Scam

SIM SWAP | సిమ్ స్వాప్ అంటే ఒకే నెంబర్‌పై మరో సిమ్ కార్డు తీసుకోవడం. అంటే కస్టమర్‌కు తెలియకుండా అతని ఫోన్ నెంబర్‌తో ఇంకో సిమ్ తీసుకొని మోసం చేయడం. పదుల సంఖ్యలో ఉన్న సైబర్ నేరాల్లో సిమ్ స్వాప్ ఒకటి.

సిమ్ స్వాప్ స్కామ్... కొద్ది రోజుల క్రితం ముంబైలో ఓ వ్యాపారి నుంచి కోట్లు నొక్కేసిన ఘరానా మోసం ఇది. ఇప్పుడీ స్కామ్ హైదరాబాద్‌లోనూ బయటపడింది. బడాబడా కంపెనీలు ఇమెయిల్స్ హ్యాక్ చేసి మరీ సమాచారాన్ని కొట్టేసిన కేటుగాళ్లు... కొత్త సిమ్ కార్డులు తీసుకొని చేసిన స్కామ్ ఇది. ఆ ఘరానా దొంగల్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో నైజీరియా ముఠా ఆటకట్టించారు పోలీసులు. హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన వెంకటక్రిష్ణ సిమ్ స్వాప్ చేసి అతని అకౌంట్ల నుంచి రూ.9 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. అతని సిమ్ కార్డు పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌కు కాల్ చేశారు. అతని పేరు మీద మరో సిమ్ కార్డు తీసుకున్నట్టు తేలడంతో షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇది నైజీరియా ముఠా పనేనని గుర్తించారు. ఆ గ్యాంగ్‌కు పశ్చిమబెంగా‌ల్‌లో ఉన్న వ్యక్తులు సహకరిస్తున్నట్టు తేలింది. ఆ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, డెబిట్, పాన్, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాలో ఉన్న ప్రధాన నిందితుడు ఎబిగ్‌బో ఇన్నోసెంట్‌ను అరెస్ట్ చేయాల్సి ఉంది.

హైదరాబాద్‌లో సిమ్ స్వాప్ కలకలం... అసలేంటి ఈ మోసం?

సిమ్ స్వాప్ అంటే ఏంటీ?
సిమ్ స్వాప్ మోసంతో కొద్ది రోజుల క్రితం ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఖాతా నుంచి ఏకంగా రూ.1.86 కోట్లు కాజేశారు కేటుగాళ్లు. సిమ్ స్వాప్ అంటే ఒకే నెంబర్‌పై మరో సిమ్ కార్డు తీసుకోవడం. అంటే కస్టమర్‌కు తెలియకుండా అతని ఫోన్ నెంబర్‌తో ఇంకో సిమ్ తీసుకొని మోసం చేయడం. పదుల సంఖ్యలో ఉన్న సైబర్ నేరాల్లో సిమ్ స్వాప్ ఒకటి. ఈ మోసాలు అమెరికా, యూరప్‌లో 2013లో తొలిసారిగా బయటపడ్డాయి. ఇండియాలో సిమ్ స్వాప్ మోసాలు కొత్తేమీ కాదు. ఈ మోసాలతో ఇప్పటికే బాధితులు రూ.200 కోట్ల వరకు నష్టపోయారని అంచనా. సిమ్ స్వాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డ్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలను సులువుగా తెలుసుకోగలరు. వాటి ద్వారా ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేసి నిండా ముంచేస్తారు.
సిమ్ స్వాప్ ఎలా చేస్తారు?
మొదట సైబర్ నేరగాళ్లు మీ వివరాలు తెలుసుకునేందుకు ఇన్స్యూరెన్స్ కంపెనీలు, బ్యాంకుల ముసుగులో మీకు ఫిషింగ్ ఇమెయిల్స్ పంపిస్తారు. వాటి ద్వారా మీ అసలు పేరు, పుట్టిన రోజు, అడ్రస్, ఫోన్ నెంబర్లు తెలుసుకుంటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా మీ వ్యక్తిగత డేటాను సేకరిస్తారు. ఆ తర్వాత ఫోన్ పోయిందని, కొత్త ఫోన్ తీసుకున్నామని, కొత్త సిమ్ కార్డు కావాలని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌ని కాంటాక్ట్ చేస్తారు. అప్పటివరకు సేకరించిన వివరాలన్నీ కరెక్ట్‌గా చెప్తారు. దీంతో మొబైల్ కంపెనీలకు ఎలాంటి అనుమానం రాదు. కొత్త సిమ్ కార్డు వచ్చేస్తుంది. కొత్త సిమ్ కార్డు ఇవ్వగానే పాత సిమ్ డీయాక్టివేట్ అవుతుంది. కొత్త సిమ్ యాక్టివేట్ కాగానే అప్పటివరకు సేకరించిన బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డుల వివరాలతో మనీ ట్రాన్స్‌ఫర్, ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. ఎలాగూ సిమ్ కార్డు తమ దగ్గరే ఉంటుంది కాబట్టి ఓటీపీ అదే నెంబర్‌కు వస్తుంది. దీంతో లావాదేవీలు సులువుగా జరిగిపోతాయి.
సిమ్ స్వాప్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సిమ్ స్వాప్ జరుగుతుందా లేదా సులువుగా తెలుసుకునేందుకు మీ మొబైల్ నెట్‌వర్క్ ఉపయోగపడుతుంది. మీ ఫోన్ నెట్‌వర్క్ కొన్ని గంటలపాటు నిలిచిపోయినట్టయితే అనుమానించాల్సిందే. అప్రమత్తం కావాల్సిందే. మీరు వెంటనే మీ మొబైల్ ఆపరేటర్‌కు కాల్ చేసి మీ ఫోన్ నెంబర్ చెప్పి వివరాలు తెలుసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవాలి. అందుకే ముందే ఇమెయిల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు బ్యాంకులో రిజిస్టర్ చేసుకోవడం మంచిది. సిమ్ కార్డు వెనుక ఉండే 20 అంకెల సిమ్ నెంబర్ చాలా కీలకం. ఆ నెంబర్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. మీరు బ్యాంకు లావాదేవీల కోసం ఉపయోగించే ఫోన్ నెంబర్ సోషల్ మీడియాతో పాటు ఇతర వెబ్‌సైట్స్‌లో అందరికీ కనిపించేలా డిస్‌ప్లే చేయొద్దు.

VIEW THE VIDEO

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The details of Sim swap Scam"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0