Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Google maps

Google మ్యాప్స్ లో రెస్టారెంట్లు , విడిది గృహాలు

 కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యావత్ భరతదేశ ప్రజలు కేవలం ఇంటికే పరిమితమయ్యారు . చాలా మంది ప్రజలు ఆహారం లేదా అవసరమైన సేవలకు అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నారు . అయితే , రిలయన్స్ మరియు ఉబెర్ వంటి సంస్థలు అవసరమైన వ్యక్తులకు సహాయం అందిస్తున్నాయి . సమీపంలో ఏ కిరాణా దుకాణం తెరిచి ఉందో మీకు తెలియజేసే వెబ్సైట్లు కూడా ఉన్నాయి . ఇక ఇప్పుడు ఈ జాబితాలో Google ని కూడా లెక్కించవచ్చు . ఎందుకంటే , ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు Google మ్యాప్స్ లో ఒక ఫీచర్‌ను జత చేసింది . దీనిలో , వినియోగదారు తన స్థానాన్ని నమోదు చేసుకున్న వెంటనే , వారికీ దగ్గర్లోని టేకౌట్ లేదా డెలివరీ అందించే రెస్టారెంట్లు వారికీ కనిపిస్తాయి . అంతే కాదు రాత్రి ఆశ్రయం కల్పించే షెల్టర్లు , కరోనా అంతం చేయడానికి ఏర్పాటు చేసిన ఆస్పత్రుల వివరాలను కూడా చూపిస్తుంది . ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల స్థానాలను పరిశీలించడానికి కూడాGoogle ఉపయోగపడుతుంది . ఈ విషయంలో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు Google తెలిపింది . మీరు Google వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే అక్కడ మీకు ' డు ది ఫైవ్ . హెల్ప్ స్టాప్ కరోనా వైరస్ ' అనే సందేశం కనిపిస్తుంది . ఒక్కసారి దాని మీద క్లిక్ చేశారంటే తర్వాత కనిపించే పేజీ మీకు కరోనా వైరస్ ను ఆపడానికి చేయాల్సిన ఐదు పనులు కనిపిస్తాయి . ఈ సమాచారంపై క్లిక్ చేస్తే ఇది మిమ్మల్ని స్థానిక ప్రభుత్వ హెల్త్ పేజీకి తీసుకెళ్తుంది . మనదేశంలో అయితే కుటుంబ , ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేజీకి తీసుకెళుతుంది . అంతేకాకుండా కరోనా వైరస్ హెల్ప్ లైన్ నంబర్ నంబర్ ' + 91 - 11 - 23978046 ' ను , టోల్ ఫ్రీ నంబర్ 1075ను కూడా చూపిస్తుంది . మిగతా వారితో దూరంగా ఉండటం గురించి తెలపడం , ఆరోగ్య సంస్థలు అందించే సూచనలు , పరీక్షలు నిర్వహించే బోర్డులు తీసుకుంటున్న నిర్ణయాల గురించి కూడా ఇక్కడ తెలిపారు . ఈ కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ వెబ్ సైట్ లో వివరించారు . అంతేకాకుండా ఎయిర్ పోర్టులో స్కీనింగ్ చేసిన ప్రయాణికులు ఎంతమంది , ప్రస్తుతం మనదేశంలో ఉన్న కరోనా వైరస్ కేసులు ఎన్ని , డిశ్చార్ అయిన తగ్గిపోయిన కేసులు ఎన్ని , మరణాలు ఎన్ని వంటి వివరాలు కూడా తెలుపుతారు . ఏ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు కావాలన్నా ప్రత్యేకంగా టేబుల్ రూపంలో ఆ సమాచారం దొరుకుతుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Google maps"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0