Decision on Teacher Transfers after 10th Class Examinations Education Minister Adhikulam Suresh Garu with leaders
10 వ తరగతి పరీక్షల అనంతరం ఉపాధ్యాయ బదిలీలపై నిర్ణయం
నేతలతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు
నేతలతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ కు YSR టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. జాలిరెడ్డి, జి.సుధీర్ గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల అనంతరం ఉపాధ్యాయ బదిలీలపై తుది నిర్ణయం తీసుకుంటామని, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
అదే విధంగా రాష్ట్రంలో CPS విధానాన్ని రద్దు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2004 సెప్టెంబరుకు ముందు పరీక్షలు నిర్వహించి అర్హత సాధించి తర్వాత నియామకమైనటువంటి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాత పెన్షన్ విధానము అమలు చేస్తామని, ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సర్వీస్ రూల్స్ కూడా త్వరలోనే అమలయ్యేలా చర్యలు తీసుకుని ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది.
2012 డీఎస్సీలో లోకల్, నాన్ లోకల్ విషయంలో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేస్తామని, సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సర్వీస్ రూల్స్ అమలు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. విద్యవ్యవస్థలో సమూల మార్పులు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచి ప్రతి పేదవాడికి ఉన్నత చదువును అందుబాటులోకి తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.
0 Response to "Decision on Teacher Transfers after 10th Class Examinations Education Minister Adhikulam Suresh Garu with leaders"
Post a Comment