Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Instant PAN number with Aadhaar

ఆధార్‌తో తక్షణం పాన్‌ నంబరు.

న్యూఢిల్లీ: ఆధార్‌ వివరాలు సమర్పిస్తే చాలు తక్షణమే ఆన్‌లైన్‌లో పాన్‌ నంబరు కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రారంభించారు. 'ఆధార్‌ నంబరుతో పాటు దానికి అనుసంధానమైన మొబైల్‌ నంబరు ఉండి, పాన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. పూర్తిగా పేపర్‌ రహితంగా, ఎలక్ట్రానిక్‌ పాన్‌ (ఈ-పాన్‌) నంబరును ఉచితంగా కేటాయించడం జరుగుతుంది' అని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తుదారు ఇన్‌స్టంట్‌ పాన్‌ పొందవచ్చు.
విధానం

  • వెబ్‌సైట్‌లో తన ఆధార్‌ నంబరు పొందుపర్చాక, దానికి అనుసంధానమైన దరఖాస్తుదారు మొబైల్‌ నంబరుకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది.
  • ఓటీపీని సమర్పించాక 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్‌ నంబరు వస్తుంది. 
  • కేటాయింపు పూర్తయ్యాక ఈ-పాన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
  • ఒకవేళ ఆధార్‌తో రిజిస్టరైన మెయిల్‌-ఐడీ ఉంటే దానికి కూడా ఈ-మెయిల్‌ వస్తుంది. 
  • తక్షణం పాన్‌ కేటాయించే ప్రక్రియకు సంబంధించిన బీటా వెర్షన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆదాయపు పన్ను శాఖ తమ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 
  • మే 25 దాకా దీని ద్వారా 6,77,680 పాన్‌ నంబర్లు కేటాయించింది. 
  • కేవలం 10 నిమిషాల్లోనే ఈ-పాన్‌ కేటాయించగలిగినట్లు సీబీడీటీ వర్గాలు తెలిపాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "Instant PAN number with Aadhaar"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0