Instant PAN number with Aadhaar
ఆధార్‌తో తక్షణం పాన్ నంబరు.
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సమర్పిస్తే చాలు తక్షణమే ఆన్లైన్లో పాన్ నంబరు కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రారంభించారు. 'ఆధార్ నంబరుతో పాటు దానికి అనుసంధానమైన మొబైల్ నంబరు ఉండి, పాన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. పూర్తిగా పేపర్ రహితంగా, ఎలక్ట్రానిక్ పాన్ (ఈ-పాన్) నంబరును ఉచితంగా కేటాయించడం జరుగుతుంది' అని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తుదారు ఇన్స్టంట్ పాన్ పొందవచ్చు.
విధానం

- వెబ్సైట్లో తన ఆధార్ నంబరు పొందుపర్చాక, దానికి అనుసంధానమైన దరఖాస్తుదారు మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది.
- ఓటీపీని సమర్పించాక 15 అంకెల అక్నాలెడ్జ్మెంట్ నంబరు వస్తుంది.
- కేటాయింపు పూర్తయ్యాక ఈ-పాన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఒకవేళ ఆధార్‌తో రిజిస్టరైన మెయిల్-ఐడీ ఉంటే దానికి కూడా ఈ-మెయిల్ వస్తుంది.
- తక్షణం పాన్ కేటాయించే ప్రక్రియకు సంబంధించిన బీటా వెర్షన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆదాయపు పన్ను శాఖ తమ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
- మే 25 దాకా దీని ద్వారా 6,77,680 పాన్ నంబర్లు కేటాయించింది.
- కేవలం 10 నిమిషాల్లోనే ఈ-పాన్ కేటాయించగలిగినట్లు సీబీడీటీ వర్గాలు తెలిపాయి.
9866244660
ReplyDeletePan
ReplyDelete