RBI MANI App: RBI App for the blind to detect currency notes
RBI MANI App: కరెన్సీ నోట్లు గుర్తించడానికి అంధుల కోసం ఆర్‌బీఐ యాప్
RBI MANI App కరెన్సీ నోట్లు గుర్తించడంలో అంధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఓ యాప్ రూపొందించింది.
RBI MANI App కరెన్సీ నోట్లు గుర్తించడంలో అంధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఓ యాప్ రూపొందించింది.
- 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అంధుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. కరెన్సీ నోట్లను గుర్తించడంలో అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా 'MANI' పేరుతో ఈ యాప్‌ను తయారు చేసింది ఆర్‌బీఐ.
- 2. MANI అంటే 'మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్'. అంటే... మొబైల్ సాయంతో నోట్లను గుర్తించే యాప్ అని అర్థం. ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే చాలు... ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది
- 3. అంధులు నోట్ల విలువను అంటే అది ఎన్ని రూపాయల నోట్ అన్న విషయం గుర్తించడానికి ఉపయోగపడుతుంది. కరెన్సీ నోట్‌ను మొబైల్‌లోని కెమెరా సాయంతో స్కాన్ చేస్తే చాలు... ఎన్ని రూపాయల నోట్ అన్న విషయం తెలుస్తుంది. హిందీ, ఇంగ్లీష్‌లో ఆడియో ఔట్‌పుట్ ఉంటుంది.
- 4.అయితే ఈ యాప్ ద్వారా ఆ నోటు ఒరిజినలో, డూప్లికేటో గుర్తించడం సాధ్యం కాదని ఆర్‌బీఐ తెలిపింది.
- 5.ఆర్‌బీఐ రిలీజ్ చేసిన 'MANI' యాప్‌ను ఆండ్రాయిడ్ Google ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
0 Response to "RBI MANI App: RBI App for the blind to detect currency notes"
Post a Comment