Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health

Health : అదే పనిగా చేతుల్ని కడుక్కుంటున్నారా . . . డేంజరే 
Health

Corona Lockdown  Corona Update : కరోనా కాలంలో శుభ్రత పాటించడం మంచిదే . అయితే . . . మరీ ఎక్కువ శుభ్రత కూడా మంచిది కాదు .

Corona Lockdown Corona Update : చేతులపై ఉండే కరోనా వైరస్ చనిపోవాలనే ఉద్దేశంతో... ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)... వీలైనన్ని ఎక్కువసార్లు చేతుల్ని సబ్బుతో 20 సెకండ్లపాటు కడుక్కోవాలని సూచించింది. అది మంచి సూచనే. ఐతే... WHO చెప్పింది కదా అని... మాటిమాటికీ, అదే పనిగా చేతుల్ని కడుక్కోవడం కూడా మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్బైనా, శానిటైజరైనా ఎక్కువ వాడటం ప్రమాదమే అంటున్నారు. అలా చేస్తే... కరోనా సంగతెలా ఉన్నా... ఇతర అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులూ వస్తాంటున్నారు. మరెలా? మనం ఏం చెయ్యాలి? తెలుసుకుందాం.
డాక్టర్ల సూచనలు :

  • ఎక్కువసార్లు చేతుల్ని శుభ్రం చేసుకుంటే (సబ్బు లేదా శానిటైజర్‌తో)... చర్మపు పై పొర దెబ్బతింటుంది. క్రిములతోపాటూ... చర్మంపై ఉండే నేచురల్ ఆయిల్స్ కూడా పోతాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే... మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉండే... సబ్బుల్ని వాడాలి.
  • చేతుల్ని కడుక్కున్న తర్వాత మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకోవాలి. ఈ క్రీమ్‌లో విటమిన్ E, బాదం, కొబ్బరి వంటివి ఉన్నాయో లేదే ప్యాకెట్‌పై చూసి... అలాంటిదే కొనుక్కోవాలి. కొన్ని మాయిశ్చరైజర్లు వాటర్ బేస్డ్ అయివుంటాయి. అవి కొనుక్కోవడం మంచిది.
  • ఒక చిన్న గిన్నెలో నాలుగు టీస్పూన్ల బాదం నూనె, ఒక టేబుల్‌స్పూన్‌ రోజ్‌వాటర్‌, అర టీస్పూన్‌ టింక్చర్‌ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని రాత్రివేళ చేతులకు రాసుకొని కాటల్ గ్లోవ్స్ ధరించి పడుకోవాలి. ఉదయాన్నే చేతులను నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చేతులపై చర్మానికి మేలు జరుగుతుంది.
  • బాదం నూనెలో తేనె కలిపి చేతులపై నెమ్మదిగా మసాజ్ చెయ్యాలి. ఇవి స్కిన్‌ లోపలికి వెళ్లి... చర్మా్న్ని కాపాడతాయి.
  •  సెనగపిండి, పసుపు, పాలు కలిపి పేస్టులా చేసి చేతులకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చేతుల్ని నీటితో కడుక్కోవాలి. ఇవి చేతులకు క్రిముల నుంచి రక్షణ కల్పిస్తాయి.

చేతికి గాయమైతే : చాలా మందికి వస్తున్న డౌట్ ఇది. చేతులకు లేదా చేతి వేళ్లకు ఏదైనా గాయం అయితే... ఆ గాయం నుంచి శరీరంలోకి కరోనా వైరస్ వెళ్తుందా అని డాక్టర్లను అడుగుతున్నారు. ఐతే... అలా వైరస్ సోకే ప్రమాదం చాలా చాలా తక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ అనేది ఇప్పటివరకూ మనుషుల ముక్కు, నోరు, కళ్లు, చెవుల నుంచి మాత్రమే బాడీలోకి ప్రవేశిస్తోందని తెలిపారు. ఇప్పటివరకూ చేతులకు గాయం అవ్వడం వల్ల కరోనా వైరస్ సోకిన కేసులు లేవన్నారు.

ఎవరికైనా చేతులకు గాయం అయితే... వీలైనంత త్వరగా ఆ గాయం నయం అయ్యేలా చేసుకుంటే మంచిదే. గాయం అయిన చోట... గోరు వెచ్చటి సబ్బు నీటితో కడిగి... ఆ ప్రదేశంలో బ్యాండేజ్ వేసుకోవడం మేలంటున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0