Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The central government's explanation of the zoning separation and the conditions in which zones in this Kovid-19 background

ఈ కోవిద్-19 నేపద్యం లో జోన్ ల విభజన మరియు యే జోన్ లలో పరిస్థితులు ఎలా ఉంటాయో కేంద్ర ప్రభుత్వ వివరణ
The central government's explanation of the zoning separation and the conditions in which zones in this Kovid-19 background  • గ్రీన్ జోన్లలో అన్నింటికీ అనుమతి ఉంటుంది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడపవచ్చు. వైన్ షాప్స్, పాన్ షాప్స్‌లకు కూడా అనుమతి ఉంటుంది.
  •  దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించింది కేంద్రం. మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని మినహా రెడ్ జోన్ల పరిధిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. వీటికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు ఎవరూ బయట తిరగకూడదు. అత్యవసరం అయితేనే రావాలి. అన్ని జోన్లలో 65 ఏళ్లు పైబడిన వ‌ృద్ధులు, రోగులు, 10 ఏళ్ల లోపు చిన్న పిల్లలు, గర్భిణీలు బయటకు రాకూడదు.

జోన్లతో సంబంధం లేకుండా వీటిపై నిషేధం :
  • దేశీయ, అంతర్జాతీయ విమానాలు, రైళ్లు, మెట్రో సర్వీసులు,అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై నిషేధం కొనసాగుతుంది. ఐతే పోలీస్, ఆర్మీ సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. వలస కార్మికులను తరలించే ప్రత్యేక రైళ్లు నడుస్తాయి
  • ఇక స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు,హాస్పిటాలిటీ సర్వీసులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటైర్‌టైన్ మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, బహిరంగ సభలు, సామూహిక మత ప్రార్థనలు, ప్రార్థనాలయాలు తెరచుకోవు.

రెడ్‌జోన్లు :
కంటైన్‌మెంట్ జోన్లు: ఈ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు పెట్టి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేయాలి. కేవలం నిత్యావసరాలు, మందుల కోసమే అనుమతించాలి. చెక్‌పోస్టు నుంచి బయటకు, లోపలికి వచ్చే వ్యక్తుల పేర్లను నమోదు చేయాలి. ఇక్కడ క్లినిక్‌లు, ఆస్పత్రుల్లో ఓపీ సేవలపైనా నిషేధం ఉంటుంది.
నాన్ కంటైన్ మెంట్ జోన్లు :
పైన చెప్పిన వాటితో పాటు ఇక్కడ రిక్షాలు, ఆటోలు, టాక్సీలు, బస్సులు, బార్బర్ షాపులు, స్పాలపైనా నిషేధం ఉంటుంది. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లే వారికి సొంత వాహనాల్లో అనుమతి ఉంటుంది. కారులో ఇద్దరు, బైక్‌పై ఒక్కరు మాత్రమే వెళ్లాలి. నిత్యావసరాల మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఫార్మా కంపెనీలు, ఐటీ హార్డ్ వేర్, జనపనార మిల్లులకు అనుమతి. ఇక్కడ పనిచేసే సిబ్బంది సామాజిక దూరం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలకు అనుమతి ఉంటుంది. నిర్మాణ పనులకు స్థానిక కూలీలతో నిర్వహించుకోవచ్చు. నగరాల్లో ఒక్కరు మాత్రమే ఉండే చిన్న షాపులను నిర్వహించుకోవచ్చు. నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దుకాణాలకు అనుమతి. ఐతే కస్టమర్లు రెండు అడుగుల సామాజిక దూరం పాటించాలి. నిత్యావసర సరుకులను సరఫరా చేసే ఈకామర్స్‌ సైట్లకు అనుమతి ఉంటుంది. ప్రైవేట్ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో నిర్వహించవచ్చు. మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలి.
ఆరెంజ్ జోన్లు :
పాయింట్ నెంబర్ 1లో చెప్పిన అంశాలతో పాటు అంతర్ జిల్లా బస్సు సర్వీసులు, జిల్లాల లోపల తిరిగే బస్సులకు అనుమతి ఉండదు. ఒక డ్రైవర్, ఇద్దరు ప్యాసింజర్లతో టాక్సీలు నడుపుకోవచ్చు. కారులో ఆరెంజ్ జోన్‌లో ఉన్న ఇతర జిల్లాలకు ప్రయాణించవచ్చు. ఐతే ఇద్దరికీ మాత్రమే అనుమతి ఉంటుంది.
గ్రీన్ జోన్లు :
 పాయింట్ 1లో పేర్కొన్న అంశాలు కాకుండా.. గ్రీన్ జోన్లలో మిగతా అన్నింటికీ అనుమతి ఉంటుంది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడపవచ్చు. వైన్ షాప్స్, పాన్ షాప్స్‌లకు కూడా అనుమతి ఉంటుంది. ఐతే ఆరడుగల సామాజిక దూరం పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది కేంద్రం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The central government's explanation of the zoning separation and the conditions in which zones in this Kovid-19 background"

Post a comment