Home loan: Is there a home loan? Reduce EMI with this technique_
Home Loan: హోమ్ లోన్ ఉందా? ఈ టెక్నిక్‌తో ఈఎంఐ తగ్గించుకోండి_
Home Loan | ఆర్థిక క్రమశిక్షణ అందరికీ అవసరమే. ఆర్థిక క్రమశిక్షణ అంటే డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకోవడమే కాదు మీ ఖర్చుల్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. హోమ్ లోన్ ఈఎంఐ తగ్గించుకోవచ్చన్న విషయం తెలియక అనేక మంది ఇప్పటికీ పాత ఈఎంఐ చెల్లిస్తున్నారు. మరి మీ ఈఎంఐ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.
Home Loan | ఆర్థిక క్రమశిక్షణ అందరికీ అవసరమే. ఆర్థిక క్రమశిక్షణ అంటే డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకోవడమే కాదు మీ ఖర్చుల్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. హోమ్ లోన్ ఈఎంఐ తగ్గించుకోవచ్చన్న విషయం తెలియక అనేక మంది ఇప్పటికీ పాత ఈఎంఐ చెల్లిస్తున్నారు. మరి మీ ఈఎంఐ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.
- 1. మీరు హోమ్ లోన్ తీసుకున్నారా? ప్రతీ నెల ఈఎంఐ చెల్లిస్తున్నారా? మీరు ఇప్పుడు చెల్లిస్తున్న హోమ్ లోన్నా కన్నా తక్కువ ఈఎంఐ చెల్లించొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా బ్యాంకుకు వెళ్లి ఓ దరఖాస్తు ఇవ్వడమే. హోమ్ లోన్ ఈఎంఐ ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారా? ఉదాహరణతో సహా తెలుసుకోండి.
- 2. మీ హోమ్ లోన్ ఎంసీఎల్ఆర్ లేదా బేస్ రేట్‌కు లింక్ అయి ఉంటే మీరు రెపో లింక్డ్ లెండింగ్ రేట్‌కు మార్చుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వడ్డీ చాలా తగ్గుతుంది. వడ్డీ తగ్గితే ఈఎంఐ కూడా తగ్గుతుంది. హోమ్ లోన్‌ను రెపో లింక్డ్ లెండింగ్ రేట్‌కు మార్చుకునే అవకాశం కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI.
- 3. ఈ విషయం బ్యాంకులు కస్టమర్లకు చెప్పవు. దీంతో ఎక్కువ ఈఎంఐ చెల్లిస్తూనే ఉంటారు. ఇప్పటికీ చాలామంది బేస్ రేట్‌కు తీసుకున్న హోమ్ లోన్‌పైనే ఈఎంఐలు చెల్లిస్తుంటారు. దీని వల్ల వడ్డీ ఎక్కువగా చెల్లించక తప్పదు.
- 4. ఉదాహరణకు ఓ వ్యక్తి ఎంసీఎల్ఆర్ లింక్డ్ వడ్డీ రేటు 7.50% ప్రకారం హోమ్ లోన్ రూ.30,00,000 తీసుకున్నాడని అనుకుందాం. టెన్యూర్ 240 నెలలు. ఇంకా 216 నెలలు ఈఎంఐలు చెల్లించాలి. అంటే ప్రిన్సిపల్ ఔట్‌స్టాండింగ్ రూ.28,60,000 ఉంటుంది.
- 5. ప్రస్తుతం రెపో లింక్డ్ లెండింగ్ రేట్ 7.15% ఉంది. అంటే ఎంసీఎల్ఆర్ లింక్డ్ వడ్డీ రేటు కన్నా 35 బేసిస్ పాయింట్స్ తక్కువ. ఒకవేళ మీరు కొత్త వడ్డీ రేటుకు మారి ఈఎంఐలో ఎలాంటి మార్పు చేయకపోతే టెన్యూర్ 206 నెలలకు తగ్గుతుంది. అంటే 10 ఈఎంఐలు తగ్గాయి. దీని వల్ల రూ.2,52,000 ఆదా అవుతుంది.
- 6. ఈ ఉదాహరణలో ఎంసీఎల్ఆర్ లింక్డ్ వడ్డీ రేటు 7.50% అని అనుకున్నాం. కానీ ఇంతకన్నా ఎక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్ తీసుకున్నవాళ్లున్నారు. అంటే ఇంకా ఎన్ని లక్షలు ఆదా అవుతుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం బ్యాంకుకు వెళ్లి ఓ అప్లికేషన్ ఇవ్వడం ద్వారా లక్షల రూపాయలు మిగిలే అవకాశం ఉంటే ఇంకేం కావాలి.
- 7. ఒకవేళ మీరు 2016 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబర్ మధ్య హోమ్ లోన్ తీసుకున్నట్టైతే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ ప్రకారం వడ్డీ ఉంటుంది. అంతకన్నా ముందు తీసుకున్నట్టైతే బేస్ రేట్ ఉంటుంది. వీటి కన్నా రెపో లింక్డ్ లెండింగ్ రేట్ చాలా తక్కువ.
- 8. ఇటీవల హోమ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. ఇందుకు కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్ భారీగా తగ్గించడమే. అయితే ఇటీవల లోన్లు తీసుకునేవారికి వడ్డీ రేటు తక్కువగానే వస్తుంది. కానీ గతంలో లోన్లు తీసుకున్నవాళ్లు మాత్రం పాత వడ్డీ రేట్ల ప్రకారమే ఈఎంఐలు చెల్లిస్తున్నారు.
- 9. అందుకే మీరు కూడా ఓసారి మీ హోమ్ లోన్ వడ్డీ రేటు ఎంతో తెలుసుకోండి. రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ఎంత ఉందో కనుక్కోండి. మీరు చెల్లిస్తున్న వడ్డీ రేటు ఎక్కువ అయితే రెపో లింక్డ్ లెండింగ్ రేట్‌కు మారండి.
- 10. ఇందుకోసం మీరు బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. ఓసారి బ్యాంకుకు వెళ్లి మీ బేస్ రేట్‌ను రెపో లింక్డ్ లెండింగ్ రేట్‌కు మార్చాలని దరఖాస్తు చేయండి. లేదా ఇమెయిల్ ద్వారా మీ రిక్వెస్ట్ పంపండి. మీరు పాత వడ్డీ రేట్ల నుంచి కొత్త వడ్డీ రేట్లకు మారాలనుకుంటే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు ఒప్పుకోవాల్సిందే. కాకపోతే వన్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
- 11. ఒకవేళ బ్యాంకులు మీ వడ్డీ రేటును మార్చేందుకు ఒప్పుకోకపోతే మీరు హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీని వల్ల తక్కువ వడ్డీకి మారొచ్చు. మీరు తక్కువ వడ్డీ రేటుకు మారినట్టైతే మీరు చెల్లించే వడ్డీ భారీగా తగ్గుతుంది. దీని వల్ల మీరు ఇంకా చెల్లించాల్సిన ఈఎంఐలను తగ్గించుకోవచ్చు.
0 Response to "Home loan: Is there a home loan? Reduce EMI with this technique_"
Post a Comment