Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

LIC Pension Scheme Popular pension scheme rules offered by AIC have changed. Let us know the new terms

LIC : ఈ పాలసీ రూల్స్ మార్చిన ఎసీ ... కొత్త నిబంధనలివే
LIC Pension Scheme Popular pension scheme rules offered by AIC have changed. Let us know the new terms

LIC Pension Scheme  ఎఐసీ అందిస్తున్న పాపులర్ పెన్షన్ స్కీమ్ రూల్స్ మారాయి . కొత్త నిబంధనలు తెలుసుకుందాం.


లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC అందిస్తున్న పెన్షన్ స్కీమ్ రూల్స్ మారాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY పథకాన్ని ఎల్ఐసీ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం గడువు 2020 మార్చి 31న ముగిసింది. అయితే ఇటీవల ఈ స్కీమ్ గడువును 2023 మార్చి 31 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అంటే మరో మూడు సంవత్సరాలు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్కీమ్ రూల్స్‌ మారాయి. గతంలో 8 శాతంగా ఉన్న వడ్డీ రేటు తగ్గింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 7.40% వడ్డీ రేటును ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. గరిష్టంగా రూ.15,00,000 మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY పూర్తి వివరాలు తెలుసుకుందాం

PMVVY SCHEME: ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్ వివరాలివే...

  • కనీస వయస్సు- 60 ఏళ్లు
  • గరిష్ట వయస్సు- గరిష్ట పరిమితి లేదు
  • పాలసీ గడువు- 10 ఏళ్లు
  • కనీస పెన్షన్- నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000
  • గరిష్ట పెన్షన్- నెలకు రూ.9,250, మూడు నెలలకు రూ.27,750, ఆరు నెలలకు రూ.55,500 , ఏడాదికి రూ.1,11,000
  • పెట్టుబడి- నెలకు రూ.1,000 పెన్షన్ కావాలంటే రూ.1,62,162 ఇన్వెస్ట్ చేయాలి. మూడు నెలలకు రూ.3,000 పెన్షన్ కావాలంటే రూ.1,61,074 ఇన్వెస్ట్ చేయాలి. ఆరు నెలలకు రూ.6,000 పెన్షన్ కోసం రూ.1,59,574 ఇన్వెస్ట్ చేయాలి. ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందాలనుకుంటే రూ.1,56,658 ఇన్వెస్ట్ చేయాలి.
  • లోన్ సదుపాయం- పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత గరిష్టంగా 75% రుణం తీసుకోవచ్చు. వడ్డీ ఏడాదికి 10% చెల్లించాలి.
  • ఫ్రీ లుక్ పీరియడ్- పాలసీ నచ్చకపోతే తీసుకున్న 15 రోజుల్లో వెనక్కి ఇచ్చేయొచ్చు. ఆన్‌లైన్‌లో తీసుకుంటే 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.
  • ప్రీమెచ్యూర్ ఎగ్జిట్- 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కి వస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "LIC Pension Scheme Popular pension scheme rules offered by AIC have changed. Let us know the new terms"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0