PM 'Kisan Scheme' remittances .. Do you get into your account or not? Do this
ప్రధాని 'కిసాన్ స్కీమ్' డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి
ప్రధాని మంత్రి ప్రకటించిన 'కిసాన్ స్కీమ్' డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఈ చిన్న తప్పులను సవరించుకుంటే.. ఖచ్చితంగా
ఈ పథకం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతుల అకౌంట్లలోకి రూ.6 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ డబ్బును మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నిధుల్ని విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 14.3 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి ఆరు వేల రూపాయలను పొందుతున్నారు. ఇటీవల లాక్‌డౌన్ కారణంగా కాస్త ముందుగానే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా డబ్బులను విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఒక్క చిన్న తప్పు వల్ల 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని తెలిసింది.
ఈ రైతుల అకౌంట్లలోకి మూడు విడతల్లో రూ.4,200 కోట్లు జమ కావాల్సి ఉంది. కానీ ఆ చిన్న తప్పు వల్ల వారి అకౌంట్లలో జమ అయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇంతకీ ఆ తప్పు ఏంటంటే.. స్పెల్లింగ్ మిస్టేక్స్.
రైతుల పేర్లలో చిన్న తప్పుల కారణంగా ఆ డబ్బు అకౌంట్‌లోకి జమ కాలేదు. ఈ తప్పు సరిదిద్దుకోకపోతే వారి అకౌంట్లలోకి డబ్బులు జమ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి మరోసారి లబ్ధిదారులు బ్యాంక్‌కు వెళ్లి వారి పేర్లను ఒకసారి సరి చేసుకుంటే మంచిది. ఆధార్ కార్డులో ఒక పేరు, బ్యాంక్‌లో ఒక పేరు ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. దీంతో చాలా మంది రైతులు.. ఈ డబ్బును అందుకోలేకపోతున్నారు.
సరిచేసుకొనే విధానం
కాగా రైతులు తమ పేరును మరో విధంగా కూడా సరిదిద్దుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయాలి. ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్‌మిట్ చేసిన వివరాలు కనిపిస్తాయి. మరోసారి వివరాలు చెక్ చేసుకొని.. తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దు కోవచ్చు.
Check your Kissan nidhi status
Check your Kissan nidhi status
0 Response to "PM 'Kisan Scheme' remittances .. Do you get into your account or not? Do this"
Post a Comment