Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

lockdown Until June 30th Lockdown ... Center sensation

Lockdown జూన్ 30 వరకు లాక్ డౌన్ ... కేంద్రం సంచలనం ...
lockdown Until June 30th Lockdown ... Center sensation

దేశవ్యాప్తంగా లాక్ డౌనన్ను జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది .

దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్ డౌన్ 5.0ను 30 రోజుల పాటు పొడిగించింది. జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, లాక్ డైన్ 5లో ప్రజలకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. జూన్ 8 నుంచి ఆలయాలు, ప్రార్థనా స్థలాలు కూడా ఓపెన్ చేసుకోవచ్చునంటూ ప్రకటించింది.

ఫేజ్ 1 ( జూన్ 8 , 2020 ) . ఫేజ్ 1 లో ప్రార్థనా స్థలాలకు అనుమతి ఉంటుంది . జూన్ 8 నుంచి ఆలయాలు , చర్చిలు , మసీదులు తెరవొచ్చు . హోటళ్లు , రెస్టారెంట్లు తెరుచుకోవచ్చు . అయితే , కుటుంబసంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుంది .

ఫేజ్ 2 ( జూలై 2020 ) ఫేజ్ 2 లో స్కూళ్లు , కాలేజీలు , విద్యాసంస్థలు , కోచింగ్ సెంటర్లు తెరవొచ్చు . అది కూడా జూలైలో . రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు .. విద్యార్థుల తల్లిదండ్రులు , వాటా దారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి .

ఫేజ్ 3 అంతర్జాతీయ విమాన ప్రయాణాలు , మెట్రో రైళ్ల సేవలు , సినిమా హాళ్లు , జిమ్ లు , స్విమ్మింగ్ పూల్స్ , ఎంటర్టైన్మెంట్ పార్క్ లు , థియేటర్లు , బార్లు , ఆడిటోరియంలు , అసెంబ్లీ హాళ్లు లాంటివి ఎప్పుడు తెరవాలనే అంశంపై ఫేజ్ 3 లో నిర్ణయం తీసుకుంటారు . సామాజిక , రాజకీయ , క్రీడా , వినోద , విద్య , సాంస్కృతిక , ఆధ్యాత్మిక కార్యక్రమాలు , భారీ ఎత్తు ఫంక్షన్లు జరపకూడదు . పరిస్థితిని బట్టి వాటిని ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "lockdown Until June 30th Lockdown ... Center sensation"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0