Activitys of tenth Examinations
పది పరీక్షల కార్యాచరణ
SSC ACTION PLAN
SSC ACTION PLAN
- పది పరీక్షల కార్యాచరణ విడుదల
- జూలై 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల షెడ్యూల్‌ను విద్యా శాఖ విడుదల చేసింది.
- పరీక్షల నిర్వహణపై ఈ నెల 18లోగా జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు.
- చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, అదనపు డిపార్టుమెంటల్ అధికారుల నియామకాలు ఈ నెల 15న సిద్ధం చేసి ఆర్డరు కాపీలను 17న జారీ చేస్తారు.
- సంబంధిత సీఎస్ లు, డీవోలు అదనపు డీవోలకు నియామకాల ఆర్డర్లు అందిందీ లేనిదీ 20న నిర్ధారించు కుంటారు.
- ఈ నెల 17, 18, 21 తేదీల్లో రూటు ఆఫీసర్లు సీ కేటగిరి సెంటర్లకు జాయింట్ కస్టోడియన్లు, కస్టోడియన్ల నియామకాలు చేపడతారు.
- పరీక్ష ఇన్విజిలేటర్లను ఈ నెల 19న చేపట్టి 22న ముగిసేలా నియామకాల ఆర్డర్లు జారీ చేస్తారు.
- పరీక్షల నిర్వహణపై ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకూ డివిజనల్ స్థాయి సమావేశాలు, శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.
- ఈ నెల 30 నుంచి జూలై ఆరో తేదీలోగా సెట్-1 ప్రశ్నాపత్రాల బండిళ్లు, పరీక్షల సామగ్రి పంపిణీ చేస్తారు.
- జూలై ఒకటి నుంచి ఏడో తేదీలోగా సెట్-2 ప్రశ్నాపత్రాల బండిళ్ల పంపిణీ జరుగుతుంది.
- పరీక్ష కేంద్రాలకు బస్సులపై ఆర్టీసీ అధికారులతో ఈ నెల 30న సమావేశం నిర్వహిస్తారు.
- జిల్లాలో పరీక్షల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమ్యూనికేషన్ ప్లాన్ ను జూలై రెండో తేదీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌కు పంపిస్తారు.*
0 Response to "Activitys of tenth Examinations"
Post a Comment