AP Assembly budget session 2020 :
AP Budget 2020 : నేడు ఏపీ అసెంబ్లీ ... మధ్యాహ్నం బడ్జెట్ సమర్పణ
కరోనా జాగ్రత్తలు :
ఈసారి ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రజా ప్రతినిధులతో గన్‌మెన్లు ఇతరత్రా ఎవరూ రారు. సభ్యులంతా సోషల్ డిస్టాన్స్ పాటిస్తారు. మాస్కులు ధరిస్తారు. అలాగే అసెంబ్లీలో కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
AP Assembly budget session 2020 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు, రేపు జరగబోతున్నాయి.
సమావేశాలు మొదలవ్వగానే... గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్... ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలిసారిగా వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రసంగం సాగనుంది. ఇది చాలా తక్కువ సేపే ఉంటుందని తెలిసింది. ప్రసంగం తర్వాత వెంటనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి... వెంటనే ఆమోదిస్తారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత సాధారణ, వ్యవసాయ బడ్జెట్లు వరుసగా మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశ పెడతారు. శాసనమండలిలో బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.
గతేడాది ప్రభుత్వం 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి మరింత పెద్ద బడ్జెట్ ఉండనున్నట్లు తెలిసింది. ఇందులో సంక్షేమ పథకాలు, నవరత్నాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
- ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం.
- 11:30కి బీఏసీ సమావేశం.
- బీఏసీ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, చర్చ, ఆమోదం.
- మధ్యాహ్నం 12:30 తర్వాత రెండు సభల్లో బడ్జెట్
- 17న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం... బడ్జెట్‌పై చిన్నగా చర్చ, ఆమోదం.- 18న అసెంబ్లీ ఉండదు. రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లు ఉంటాయి.
- 19న రాజ్యసభ ఎన్నికలు... ఫలితాలు
- నేడు ఏపీ అసెంబ్లీ... మధ్యాహ్నం బడ్జెట్ సమర్పణ...
కరోనా జాగ్రత్తలు :
ఈసారి ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రజా ప్రతినిధులతో గన్‌మెన్లు ఇతరత్రా ఎవరూ రారు. సభ్యులంతా సోషల్ డిస్టాన్స్ పాటిస్తారు. మాస్కులు ధరిస్తారు. అలాగే అసెంబ్లీలో కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
0 Response to "AP Assembly budget session 2020 : "
Post a Comment