Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Over Draft Facility for Salary Account

శాలరీ అకౌంట్ కి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ... ఓడీ పొందేందుకు ఇలా చెయ్యండి ...
Over Draft Facility for Salary Account

కరోనా సమయంలో... ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న ICICI బ్యాంక్... ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే... తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్నవారికి... ఓవర్ డ్రాఫ్ట్ (OD) సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపింది. శాలరీ అకౌంట్ ఉన్నవారు... ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని... అదనపు డబ్బు పొందవచ్చని వివరించింది. ఇందుకోసం ఇన్‌స్టా ఫ్లెక్సీ క్యాష్ అనే ఆప్షన్‌ను బ్యాంక్ ఆన్‌లైన్ అకౌంట్ ద్వారా ఎంపిక చేసుకోవాలని తెలిపింది. ఇలా ఎంపిక చేసుకున్నవారి అకౌంట్‌ను బ్యాంక్ ఉద్యోగులు వెంటనే పరిశీలించి... ఓడీ సదుపాయం కల్పిస్తారు. ఎంత మనీ కావాలో... ఎంచుకున్నాక... 48 గంటల్లో ఆ డబ్బు అకౌంట్‌లో జమ అవుతుంది. ఐతే... దీనిపై కొంత వడ్డీ వసూలు చేయనుంది బ్యాంక్.
ఇక్కడో కండీషన్ ఉంది. వడ్డీ అనేది... ఓడీ తీసుకున్నంత అమౌంట్‌పై ఉండదు. ఆ ఓడీలో ఎంత మొత్తం వాడారో దానిపైనే వడ్డీ వేస్తారు. సపోజ్ రూ.10000 ఓడీ తీసుకొని... అందులో రూ.5000 మాత్రమే వాడితే... వడ్డీ ఆ రూ.5వేల పైన మాత్రమే పడుతుంది.

ఇంతకీ ఓడీ ఎంతవరకూ ఇస్తారనే డౌట్ ఉండటం సహజమే. కస్టమర్ల అకౌంట్‌లో వచ్చే నికర శాలరీకి... మూడు రెట్లవరకూ ఓడీ పొందవచ్చు. అంటే... ఉదాహరణకు ఓ వ్యక్తికి రూ.20వేల శాలరీ నెలనెలా జమ అవుతుంటే... ఆ వ్యక్తి... రూ.60వేల దాకా ఓడీ పొందవచ్చు. 48 గంటల్లో ఆ డబ్బు అకౌంట్‌లోకి వస్తుంది. దాన్ని అవసరాలకు వాడుకోవచ్చు. తిరిగి ఆ డబ్బును ఖాతాదారులు వీలునుబట్టీ చెల్లించవచ్చు. వడ్డీ మాత్రం... నెలనెలా బ్యాంక్ వసూలు చేస్తుంది. కాబట్టి... ఖాతాదారులు వీలైనంత త్వరగా ఆ ఓడీని వదిలించుకోవడం మేలు.వడ్డీ వసూలు చేస్తారు కాబట్టి... ఇది ఫ్రీగా ఇస్తున్న ఆఫరేమీ కాదనుకోవచ్చు. కాకపోతే... కరోనా కష్టకాలంలో ఎక్కడెక్కడో అప్పులు చేసి... భారీగా వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడే బదులు... ICICI బ్యాంక్ ద్వారా ఈజీగా వెంటనే ఓడీ పొందే వీలు కలుగుతోంది. ఈ సదుపాయాన్ని శాలరీ అకౌంట్ ఉన్నవారంతా ఉపయోగించుకోవాలని బ్యాంక్ మేనేజ్‌మెంట్ కోరింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Over Draft Facility for Salary Account"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0