Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NCERT Report on School Re-Opening

స్కూల్ రి ఓపెనింగ్ పై NCERT నివేదిక
NCERT Report on School Re-Opening


కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరవాలంటే విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(NCERT) పలు సిఫారసులు చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం వాటిని ఆయా రాష్ట్రాలకు పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిశీలించి స్థానిక పరిస్థితులను బట్టి మార్పు చేసుకోవచ్చు. పాఠశాలల పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకుంటామని, ఆగస్టు 15 తర్వాత తెరచుకునే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు.

NCERT సిఫారసులు

  • షిఫ్టు విధానంలో క్లాస్ లు నిర్వహించాలి. క్లాస్ లో సగం మందికి ఒకరోజు, మిగిలిన వారికి మరో రోజు తరగతులు జరపాలి.
  • అసైన్‌మెంట్లు ఇంటికే ఇవ్వాలి.
  • బెంచీలపై విద్యార్థుల పేర్లు రాస్తారు. అక్కడే విద్యార్థులు కూర్చోవాలి.
  • ఇంటర్వెల్‌ను ఒక్కో తరగతికి వేర్వేరుగా ఇవ్వాలి. వాటి మధ్య 10-15 నిమిషాల వ్యవధి ఉండేలా చూడాలి.
  • AC తరగతి గదులు ఉండటానికి వీల్లేదు.
  • తరగతి గదులు, కిటికీలు ఎప్పుడూ తెరిచే ఉంచాలి.
  • విడత వారీగా తరగతులు ప్రారంభించాలి.
  • మొదట ఇంటర్‌, వారం తరువాత 9, 10 తరగతులు, మరో రెండు వారాల అనంతరం 6, 7, 8 తరగతులు, మూడు వారాల అనంతరం 3, 4, 5 తరగతులు, నాలుగు వారాల తరువాత 1, 2 తరగతులు ప్రారంభించాలి.
  • తల్లిదండ్రుల అంగీకారంతో చివర్లో నర్సరీ తరగతులను ప్రారంభించాలి.
  • భోజనం, ఇతర ఆహార పదార్థాలను విద్యార్థులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోరాదు.
  • స్కూళ్ల వద్ద తినుబండారాల విక్రయాలు నిషేధం.
  • స్కూల్ ప్రాంగణంలోని ఆరుబయట స్థలంలో  తరగతులు నిర్వహించు కోవచ్చు.
  • హాస్టళ్లు ఉంటే విడతల వారీగా విద్యార్థులను రప్పించాలి.
  • ఒక్కో విద్యార్థి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి.


NCERT-National Council of Educational Research and Training .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NCERT Report on School Re-Opening"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0