Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Teachers go to America

ఏపీ టీచర్లు .. ఎంచక్కా అమెరికాకు !
తొలి విడతగా 20 మంది 
 ఎంపిక చేయనున్న ఏపీఎస్ఆర్టీ 
డిసెంబర్ 1 నుంచి శిక్షణ.
AP Teachers   go to America

సబ్జెక్టులు : గణితం , ఆంగ్లం

 విద్యార్హత : బీఈడీ 

పని అనుభవం : కనీసం రెండేళ్ల బోధన

సామర్థ్యం : ఆంగ్ల భాషా నైపుణ్యం 

జీతం : ఏడాదికి 40 వేల నుంచి 70 వేల డాలర్ల 

వరకు దరఖాస్తు చేసుకునే విధానం : 

వెబ్ సైట్ : www.apnrt.com/nurses 

వాట్సాప్ నంబర్ : +918500027678 హెల్ప్ లైన్ నంబర్ : +918632340678

 రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ప్రైవేటు ఉపాధ్యాయులను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( యూఎస్ఏ ) ఆహ్వానిస్తోంది . ఇప్పటికే అమెరికాలో ఉన్న రాష్ట్ర ప్రైవేటు ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను గుర్తించిన అక్కడి పాఠశాల అధికారులు .. మరింత మందిని ఆంధ్రప్రదేశ్ నుంచి రప్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు . ఉపాధ్యాయుల కొరతను అధిగ మించేందుకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ( ఏపీఎస్ఆర్టీ ) ని అక్కడి పాఠశాల అధికా రులు సంప్రదిస్తున్నారు . అర్హులను పంపాలని కోరుతున్నారు . ఈ క్రమంలో కసరత్తు ఆరంభించిన ఏపీఎస్ఆర్టీ అధికారులు .. విడతల వారీగా ఉపాద్యాయులను ఎంపిక చేసి పంపాలని నిర్ణయించారు . అమెరికా లోని టెక్సాస్ నుంచి విన్నపం అందిన నేపథ్యంతో అక్కడికి తొలి విడతగా 20 మందిని పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు . 
ఏడేళ్ల పాటు బోధనకు అనుమతి 
పబ్లిక్ పాఠశాలల్లో బోధన కోసం వెళ్లే వారికి ఏడేళ్ల పాటు అక్కడ ఉండి విద్యా ర్థులకు విద్యాబుద్ధులు నేర్పేలా అమెరికా ప్రభుత్వం వీసాకు అనుమతి ఇవ్వనుంది . ఆపై అక్కడి ప్రభుత్వ నిర్ణయం మేరకు వీసాను పొడిగించే అవకాశం ఉంటుంది . 
నెలపాటు శిక్షణ 
ఎంపిక చేసిన అభ్యర్థులకు డిసెంబర్ 1 నుంచి నెలపాటు అక్కడి శిక్షకులతో ఆన్లైన్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు . దీంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం , ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ఏపీఎస్ఆర్టీ అధికారులు మెలకువలు నేర్పనున్నారు . అయితే ఎంపికైన అభ్యర్థులు అమెరికాకు వెళ్లేందుకు అయ్యే విమాన ఛార్జీని భరించాల్సి ఉంటుందని ఏపీఎన్ ఆర్‌టీ సీఈవో వేమూరు రవి ' ఈనాడు డిజిటల్ కు తెలిపారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "AP Teachers go to America"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0