EMCET Officers have provided some information to the students who completed the Andhra Pradesh Inter ..
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పూర్తి అయిన విద్యార్ధులకు ఎంసెట్ అధికారులు కొంత ఊరట అందించారు..
ఏపీ ఎంసెట్.. ముఖ్యమైన తేదీలు ఇవే…
- కరోనా నేపధ్యంలో ఎగ్జామ్ సెంటర్‌ను మార్చుకునే అవకాశం కల్పించనున్నారు..
- ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఏపీ ఎంసెట్ పరీక్షకు 2,64,857 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ రవీంద్ర వెల్లడించారు.
- వీరిలో ఇంజనీరింగ్‌కు 1,79,774మంది, అగ్రికల్చర్ మెడిసిన్‌కు 84,479మంది, ఈ రెండింటికీ 604 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు.
- ఇక జూలై 27 నుంచి 31 వరకూ జరిగే ఎంసెట్ పరీక్షను విద్యార్ధులు రాసేందుకు వీలుగా ఎగ్జామ్ సెంటర్ మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించనున్నట్లు కన్వీనర్ రవీంద్ర చెప్పుకొచ్చారు..
- దీని కోసం ఈ నెల 22, 23 తేదీల్లో ప్రత్యేక ఆప్షన్‌ను ఇస్తున్నామన్నారు..
ఏపీ ఎంసెట్.. ముఖ్యమైన తేదీలు ఇవే…
- రూ. 500 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ. 1000 ఫైన్‌తో జూలై 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ. 5000 జరిమానాతో జూలై 17 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ. 10,000 ఆలస్య రుసుంతో జూలై 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
- ఎంసెట్ ఎగ్జామ్ తేదీలు: జూలై 27 నుంచి 31
0 Response to "EMCET Officers have provided some information to the students who completed the Andhra Pradesh Inter .."
Post a Comment