Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Cabinet Meeting : Soosa385 Šes Igowev ... MSME , రైతులు , వీధివ్యాపారులపై వరాల జల్లు

Cabinet Meeting : Soosa385 Šes Igowev ... MSME , రైతులు , వీధివ్యాపారులపై వరాల జల్లు
Cabinet Meeting : Soosa385 Šes Igowev ... MSME , రైతులు , వీధివ్యాపారులపై వరాల జల్లు

PM Modi Cabinet Decisions : ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎంఎస్ఎంఇల తక్షణ అవసరాల కోసం రూ . 20,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది . అంతేకాదు MSME లను లిస్టింగ్ ( MSME Listing ) చేసుకునే సదుపాయం కల్పించారు .

లాక్ డౌన్ 5.0 నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో చాలా ముఖ్యమైన, పలు చారిత్రక నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐదవ దశ లాక్‌డౌన్ (Lockdown 5.0)అమల్లోకి వచ్చింది. దీంతో ఈ కేబినెట్ సమావేశం ప్రత్యేకమైనదని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంది. మోడీ ప్రభుత్వం 2.0 మొదటి సంవత్సరం పూర్తచేసుకున్న నేపథ్యంలో కేబినేట్ సమావేశం జరగడం గమనార్హం. కేబినెట్ సమావేశం తరువాత కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, నితిన్ గడ్కరీ, నరేంద్ర సింగ్ తోమర్ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల గురించి మీడియాకు సమాచారం అందించారు.
MSMEలపై వరాల జల్లు :
కేంద్ర క్యాబినెట్ MSME నిర్వచనాన్ని మార్చేసింది. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కొత్త గుర్తింపు ఇచ్చింది. ముఖ్యంగా రూ. 1 కోటి పెట్టుబడితో రూ. 5 కోట్ల టర్నోవర్ వ్యాపారాలను మైక్రో ఇండస్ట్రీ విభాగంలో చేర్చగా, రూ .10 కోట్ల పెట్టుబడి రూ .50 కోట్ల టర్నోవర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ జాబితాలో చేర్చింది, అలాగే రూ .20 కోట్ల పెట్టుబడి రూ. 250 కోట్ల టర్నోవర్‌తో మీడియం పరిశ్రమ విభాగంలో చేర్చారు. 2006 MSME చట్టం 14 సంవత్సరాల తరువాత సవరించడం విశేషం. ఈ నిర్ణయాలతో సుమారు 2 లక్షల కంపెనీలు లబ్ధి పొందనున్నాయి.
MSME కోసం రూ. 50 వేల కోట్ల ఈక్విటి పథకం :
MSME కోసం ప్రత్యేక ఈక్విటీ పథకాన్ని (Equity Scheme for MSME) కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ముందుగానే ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎంఎస్‌ఎంఇల తక్షణ అవసరాల కోసం రూ. 20,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు MSMEలను లిస్టింగ్ (MSME Listing) చేసుకునే సదుపాయం కల్పించారు. MSME ల కోసం రూ .50 వేల కోట్ల ఈక్విటీ ఆధారిత పెట్టుబడిని ప్రకటించినట్లు ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఇందులో, కంపెనీలు మార్కెట్లో లిస్టింగ్ చేసుకోవడం ద్వారా చేయడం ద్వారా నిధులను సమీకరించుకోవచ్చు. దేశవ్యాప్తంగా 6 కోట్లకు పైగా MSMEలు ఉన్నారు. కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు ఈ రంగం కుదేలయ్యింది. దీంతో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది.
50 లక్షల మంది పైగా వీధి వ్యాపారులకు రుణాలు :
వీధి వ్యాపారులకు క్రెడిట్ పథకం కూడా ఆమోదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ పథకానికి 'ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి ' అని పేరు పెట్టారు. కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక సూక్ష్మ రుణ పథకాన్ని ప్రారంభించే బాధ్యతను స్వీకరించింది. దీని ద్వారా చిన్న షాపులు లేదా వీధి వ్యాపారులు రుణాలు తీసుకోవచ్చు. సుమారు 50 లక్షలకు పైగా దుకాణదారులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. సకాలంలో డబ్బు తిరిగి చెల్లించే వారికి 7 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. రుణ చెల్లింపులో ఎటువంటి జరిమానా విధించాలనే నిబంధన లేదు.
రైతులకు వరాలు...
అంతేకాదు 14 పంటలకు కనీస మద్దతు ధరను కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా రైతులకు ధర కంటే 50-83 శాతం ఎక్కువ లభించనుంది. లాక్ డౌన్ సందర్భంగా ప్రభుత్వం పంటల కోతకు అనుమతి ఇచ్చి రైతులకు అండగా నిలిచిందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇప్పటి వరకు గోధుమలను 360 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం వరకు 342 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి రావడం గమనార్హం. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు వరి సేకరణ ద్వారా 95 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తి అయ్యిందని. గతేడాది ఇది 90 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని మంత్రి తెలిపారు. అలాగే పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణ ఈ సంవత్సరం ఇప్పటివరకు 16.07 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, గత సంవత్సరం 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Cabinet Meeting : Soosa385 Šes Igowev ... MSME , రైతులు , వీధివ్యాపారులపై వరాల జల్లు"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0