Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The electricity meter reading and current bill will be calculated from tomorrow

రేపటి నుంచి విద్యుత్ మీటర్ రీడింగ్, కరెంటు బిల్లు ఇలా లెక్కిస్తారు.

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా విద్యుత్‌ మీటర్ రీడింగ్, బిల్లుల జారీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా రెండు నెలలుగా(ఏప్రిల్, మే) విద్యుత్ మీటర్ రీడింగ్ జరగలేదు. ఈఆర్‌సీ ఆదేశాల మేరకు ఏప్రిల్‌, మే రెండు నెలలకు బిల్లులు జారీ చేయకుండా ప్రొవిజినల్‌ బిల్లులను చెల్లించే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం 5వ దశ లాక్ డౌన్ లో ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. దీంతో హైదరాబాద్ నగరంలో విద్యుత్ బిల్లుల జారీ మళ్లీ మొదలు కానుంది. మంగళవారం(జూన్ 2,2020) నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకోసం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
మీటర్‌ రీడర్లు మాస్కులు, గ్లౌజులు ధరించడం, శానిటైజర్లను వినియోగించడం తప్పనిసరి చేశారు.

రోజుకి గరిష్టంగా 300 ఇళ్లకు బిల్లులు:
విద్యుత్‌ మీటర్‌ రీడర్లు ప్రతి రోజు గరిష్టంగా 300 ఇళ్లకు తిరిగి బిల్లులు జారీ చేస్తారు. అపార్ట్‌మెంట్లయితే ఒక్కోరోజు 500 వరకు సైతం బిల్లులు జారీ చేస్తారు. అయితే తాజా పరిస్థితుల్లో మీటర్‌ రీడర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డిస్కం అధికారులు సూచిస్తున్నారు. మీటర్‌ రీడర్లు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లినప్పుడు విధిగా శానిటైజేషన్‌ చేసుకోవాలని, ముక్కు, మూతికి మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించాలంటున్నారు. ఇక కాంట్రాక్ట్‌ ఏజెన్సీలే విధిగా బాధ్యత తీసుకుని మీటర్‌ రీడర్లకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులను ఉచితంగా అందించాలని ఆదేశాలిచ్చారు.
బిల్లుల జారీ ఇలా:
ప్రస్తుత మార్చి, ఏప్రిల్‌ నెలలకు 2019 మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో చెల్లించిన మొత్తాన్నే ప్రొవిజినల్‌ బిల్లులుగా జారీచేసిన విషయం తెలిసిందే. కొంతమంది ఆయా బిల్లును చెల్లించగా, మరికొంత మంది చెల్లించ లేదు. దీని దృష్ట్యా పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా స్పాట్‌ బిల్లింగ్‌ మీటర్‌ రీడర్లల్లో ఆయా డేటాను లోడింగ్‌ చేసి అందుబాటులో ఉంచుతున్నారు.

  • మార్చి, ఏప్రిల్‌, మే మూడు నెలల్లో వినియోగించిన మొత్తం రీడింగ్‌ను నమోదు చేస్తారు.
  • మీటర్‌ రీడింగ్‌ తీసిన తర్వాత మొత్తం యూనిట్లను మూడు నెలలతో భాగించి ఒక్కో నెలకు ఎంత చెల్లించాలో యావరేజీ బిల్లుగా తేల్చుతారు.
  •  ఆ తర్వాత ఇది వరకే ప్రొవిజినల్‌ బిల్లు కట్టి ఉంటే వాస్తవిక బిల్లు నుంచి ఆయా మొత్తాన్ని మినహాయించి కొత్త బిల్లును జారీ చేస్తారు.
  • ఒకవేళ 2019 మార్చి, ఏప్రిల్‌ మాసాల ప్రొవిజినల్‌ బిల్లు కన్నా ప్రస్తుత బిల్లు కంటే అధికంగా చెల్లిస్తే మైనస్‌ బిల్లు, తక్కువ చెల్లించి ఉంటే వాస్తవిక బిల్లులను జారీచేస్తారు.
  • మైనస్‌ బిల్లు జారీ అయితే ఎంత అదనంగా చెల్లించారో ఆయా మొత్తాన్ని తర్వాత మాసాల్లో జారీచేసే వాస్తవిక బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. తక్కువ చెల్లించిన వారు, అసలే చెల్లించని వారు మాత్రం వాస్తవిక బిల్లు ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది.
  • జూన్ 2వ తేదీ నుంచి బిల్లుల జారీ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The electricity meter reading and current bill will be calculated from tomorrow"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0