Close to 150 million Students in 191 countries are closed schools worldwide
ప్రపంచవ్యాప్తంగా మూతపడిన పాఠశాలలు 191 దేశాల్లో 150 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం.
డిజిటల్ ఎడ్యుకేషన్ ... సమస్యకు పరిష్కారం కాదు :నిపుణులు
డిజిటల్ ఎడ్యుకేషన్ ... సమస్యకు పరిష్కారం కాదు :నిపుణులు
- కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి
- ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి .
- మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కడా తగ్గటం లేదు . లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 191 దేశాల్లో పాఠశాలలు మూతపడ్డాయి .
- తరగతిగది బయట దిక్కుతోచని స్థితిలో 150 కోట్ల మంది విద్యార్థులు , 6. 3 కోట్ల మంది టీచర్లు ఉన్నారు .
- ఇదిలాఉండగా ... భారత్ లో ప్రయివేటు , కార్పొరేట్ స్కూల్స్ ' డిజిటల్ క్లాస్ రూమ్స్ ' ' ఆన్లైన్ క్లాసులు ' మొదలెట్టేశాయి .
- ఇదెంతమాత్రమూ సరైంది కాదని , ఇలాంటి విధానాల్ని ప్రోత్సహిస్తే కోట్లాదిమంది విద్యార్థుల విద్యావకాశాలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు .
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది . మనదేశంలో పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారు ? లా డౌన్ తర్వాత ఎలా ఉండబోతున్నాయి ? అన్నవాటి పై విధానపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు . తరగతి బోధనా ? సిలబస్ తగ్గిస్తారా ? విద్యార్థులను రెండు బ్యాచుగా విడగొట్టడమా ?
విధానం బాగుంటుందన్న చర్చ అనేకదేశాల్లో జరుగుతున్నది . వివిధ దేశాలు ఇదమిత్తంగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి . కానీ మనదేశంలో ' డిజిటల్ ఎడ్యుకేషన్'ను ప్రోత్సహిస్తూ , అందుకు అనుమతిస్తూ మోడీ సర్కార్ సంకేతాలు ఇచ్చేసింది . ఈనేపథ్యంలో ప్రయివేటు , కార్పొరేట్ స్కూల్స్ ' ఆన్ లైన్ క్లాసులు ' ప్రారంభించాయి . విద్యా సంవత్సరం ప్రారంభం గురించి జులైలో ప్రకటిస్తామని కేంద్ర మంత్రులు ఒకవైపు చెబుతూ ఉన్నారు . ఇదంతా గమనించాక విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒక గందరగోళం నెలకొంది . ప్రయివేటులో ప్రారంభమై , ప్రభుత్వ రంగంలో తరగతులు మొదలుగాకపోతే ఎలా అన్నది వారిని వేధిస్తున్నది . ఇదిలాగే కొనసాగితే ... డిజిటల్ ఎడ్యుకేషన్ వల్ల కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బకొడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు . వైరస్ బారిన పడకుండా విద్యాసంవత్సరం ఎలా మొదలు పెట్టాలనేదానిపై కాకుండా ' డిజిటల్ ఎడ్యుకేషన్ పొందండి ... అంటూ కేంద్రం చేతులు దులుపేసుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .
పరిష్కారం..ఎలా ?
కరోనా మహమ్మారిని అడ్డుకోవటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు . వైరస్ వ్యాప్తిని అడ్డుకోకుండా విద్యారంగ సమస్యలు పరిష్కరించలేమని వారు చెబుతున్నారు . మనదేశంలోనే కాదు , ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డిజిటల్ సేవలు పొందేవారికి , పొందలేనివారికి మధ్య చాలా అంతరం ఉంది . ' డిజిటల్ ఎడ్యుకేషన్ ' ఎడ్యుకేషన్ ' కోట్లాదిమంది అవకాశాల్ని కాలరాస్తుందనటంలో సందేహం లేదు . తద్వారా సమాజంలో , దేశంలో ... పెద్ద ఎత్తున విభజనరేఖను తీసుకొస్తుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
- విదేశాలలో
- • భారత్ , ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు లేని కుటుంబాలు 82 శాతం . కంప్యూటర్ లేని కుటుంబాలు 90 శాతం .
- డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తే ... ఇంటర్నెట్ వసతి , డిజిటల్ సేవలు .. అందుకోలేని పిల్లలు విద్యా సంవత్సరాన్ని కోల్పోతారు .
- ఖరీదైన స్మార్ట్ ఫోన్ , ఇంటర్నెట్ డాటా కోసం పేద , మధ్య తరగతి కుటుంబాలు ఖర్చు చేయలేవు .
- ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లమంది విద్యార్థులకు కంప్యూటర్ లేదు .
- 40 కోట్ల మంది పిల్లలకు ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేదని ' యునెస్కో ' అధ్యయనం ఒకటి తెలిపింది .
- ఇంటర్నెట్ , ఆన్లైన్ సేవలు విస్తారంగా అందుబాటులో ఉనప్పటికీ ఆన్లైన్ క్లాసులు ...
- తరగతి గది బోధనకు సాటిరావని , విద్యా లక్ష్యాలు నెరవేరవని నిపుణులు చెబుతున్నారు .
0 Response to "Close to 150 million Students in 191 countries are closed schools worldwide"
Post a Comment