Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you get corona with mosquitoes?

దోమలతో కరోనా వస్తుందా ?

కరోనా ఎలా వస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఈ దిక్కుమాలిన వైరస్ ఎలా వ్యాప్తి చెందుతోంది ? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..వైరస్ బారిన ఎలా పడుతున్నారు ? అనే సందేహాలు అందరిలో వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే చాలా మంది చనిపోతున్నారు. లక్షలాది సంఖ్యలో వైరస్ బారిన పడుతూ,చావుతో కొట్టుమిట్టాడు తున్నారు.


కంటికి కనిపించని కరోనాకు మందు కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా పేరు చెబితేనే...ప్రజలు దడుసుకొనే పరిస్థితి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 97 లక్షలు దాటిందంటే ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్థం చేసుకోవచ్చు.

దోమల వల్ల కరోనా వస్తుందా?
 ప్రస్తుతం వానాకాలం కావడంతో దోమల వల్ల కరోనా వస్తుందా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై Italy's national health institute ISS శాస్త్రీయ అధ్యయనం చేసింది.
మానవుల్లో దోమలు కరోనా వైరస్ వ్యాప్తి చేయదని నిర్ధారించారు. దీనిపై World Health Organisation కూడా రెస్పాండ్ అయ్యింది. రక్తం పీల్చే కీటకాల ద్వారా..వైరస్ వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది.

దోమలు మానవుడిని కుట్టిన సమయంలో...కోవిడ్ ను వ్యాప్తి చేయలేదని తెలిపింది.
కరోనాతో కోలుకున్న 30 శాతం మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్నారని, ఈ సమస్య కారణంగా ఎప్పుడూ అలసిపోతారని వెల్లడించింది. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you get corona with mosquitoes?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0