Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ESR

ESR
ఉద్యోగుల సమాచారం డిజిటలీకరణ_
ఇక ఎవరి ప్రమేయం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలు
ESR

ఇక ఎవరి ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతభత్యాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ.. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్ (హెచ్ సీఎం) వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది.


  • ఇప్పటికే ఆర్ధిక శాఖ అనుబంధ విభాగాల ఉద్యోగులకు ఈ వ్యవస్థ ద్వారా జీత భత్యాలను చెల్లిస్తోంది. దశల వారీగా మిగతా శాఖల ఉద్యోగులందరికీ ఈ వ్యవస్థ ద్వారానే జీత భత్యాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టింది.
  • ఉద్యోగుల నియామకం నుంచి పదవీ విరమణ వరకు డిజిటలీకరణ చేయనున్నారు.
  • ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఉద్యోగులు తమ జీత భత్యాల కోసం డ్రాయింగ్ అండ్ డిస్ బర్సింగ్ ఆఫీసర్స్ (డీడీవోలు) చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
  • ఇప్పటికే ఆర్ధిక శాఖ.. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎస్ఎంఎస్) ద్వారా నగదు చెల్లింపులు చేస్తోంది. ఈ చెల్లింపులు ఎవరి ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే సాగుతున్నాయి. దీనికి అనుబంధంగా ఇప్పుడు ఉద్యోగుల చెల్లింపుల కోసం హెచ్ సీఎం వ్యవస్థను తీసుకువస్తోంది.
  • ఈ ప్రక్రియలో ఉద్యోగుల ఇంక్రిమెంట్, ప్రమోషన్, వంటి ప్రతి అంశాన్ని నమోదు చేస్తారు. దీనివల్ల జాప్యం లేకుండా ప్రతి పని నిర్ణీత వ్యవధిలో పూర్తవుతుంది.
  •  పదవీ విరమణ చేసే ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలతో పాటు మిగతా ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు కాల క్రమంలో నిర్ణీత గడువును నిర్ధారించనున్నారు.*
  • ఉద్యోగుల సర్వీసు పుస్తకాలన్నింటినీ కంప్యూటరీకరించడంతో అందులో ఉన్న వివరాలన్నీ ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంటాయి.*
  • ప్రతి నెలా ఉద్యోగులకు రావాల్సిన పరిహారాలు ఆటోమెటిక్ గా జనరేట్ అవుతాయి. దీని కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ఉద్యోగుల జీతాలే కాకుండా ఇంక్రిమెంట్లు, ఎనౌక్యాష్ మెంట్ లీవులు వంటివన్నీ ఏ నెలకానెల నమోదవుతాయి.*
  •  తమకు ఇంక్రిమెంట్ కావాలని, జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుకునే పరిస్థితి ఉండదు.
  • ప్రభుత్వం కరువు భత్యం పెంచితే తక్షణం ఉద్యోగుల ఖాతాలో జమ అవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ESR"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0