Good news for Jan Dhan Customers
జన్ ధన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.
హైదరాబాద్ : జన్ ధన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20 కోట్ల మంది మహిళలకు మూడో విడత డబ్బులు అందజేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1,000 ట్రాన్స్‌ఫర్ చేసిన ఎస్‌బీఐ మూడో విడత డబ్బు జమ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు..జన్‌ధన్ ఖాతాలు కలిగిన వారందరికీ జూన్ 5న నగదు ట్రాన్స్‌ఫర్ మొదలవుతుందని..జూన్ 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. డబ్బు విత్‌డ్రా కోసం ఖాతాదారులు ఏటీఎంల వద్ద గుమిగూడే అవకాశం ఉందని భావించిన కేంద్రప్రభుత్వం 5 రోజులు, 5 విడతల్లో నగదు బదిలీ చేయనుంది. ఇక లబ్ధిదారులు ఏటీఎంలు, బ్యాంకు మిత్రాలు, సీఎస్పీల దగ్గర ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది.
అకౌంట్ నెంబర్ల వారిగా ఐదు రోజులు నగదు బదిలీకి సంబంధించి వివరాలు..- జూన్ 5న అకౌంట్ నెంబర్ చివర్లో 0 లేదా 1 నెంబర్ ఉన్నవారికి
- జూన్ 6న అకౌంట్ నెంబర్ చివర్లో 2 లేదా 3 నెంబర్ ఉన్నవారికి
- జూన్ 8న అకౌంట్ నెంబర్ చివర్లో 4 లేదా 5 నెంబర్ ఉన్నవారికి
- జూన్ 9న అకౌంట్ నెంబర్ చివర్లో 6 లేదా 7 నెంబర్ ఉన్నవారికి
- జూన్ 10న అకౌంట్ నెంబర్ చివర్లో 8 లేదా 9 నెంబర్ ఉన్నవారికి... నగదు చెల్లించనున్నారు.
0 Response to "Good news for Jan Dhan Customers"
Post a Comment