Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If the coronavirus is infected, then the central government has to issue new guidelines ...

ఇకపై కరోనా సోకితే అలా చెయ్యాల్సిందే... కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ...
If the coronavirus is infected, then the central government has to issue new guidelines ...

Corona Lockdown | Corona Update : చూస్తూ చూస్తూనే ఇండియాలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఇకపై ఎవరికైనా కరోనా సోకితే... వారిని ఆస్పత్రికి తీసుకెళ్లరు. ఇంట్లోనే ఉంచి ట్రీట్‌మెంట్ చేస్తారు. రోజూ డాక్టర్లు ఫోన్ చేసి... ఎలా ఉంది అని అడుగుతారు. ఏయే మందులు వాడాలో చెబుతారు. అప్పుడప్పుడూ డాక్టర్లు వచ్చి చూస్తారు. ఇలా మొత్తం 17 రోజులపాటూ ట్రీట్‌మెంట్ ఉంటుంది. పరిస్థితి విషమిస్తే... వైరస్ మరింత పెరిగితే... అప్పుడు మాత్రమే టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేస్తే... వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తారు.

వైరస్ సోకిన వారిని...పిల్లలు, ముసలివాళ్లకు దూరంగా ఉంచాలి. వీలైతే వాళ్లను వేరే చోటికి పంపాలి. ఇంట్లో వారంతా ప్రోటీన్స్ ఉండే మంచి ఆహారం (చికెన్, వేరుసెనగ గింజలు, అల్లం వంటివి) తీసుకోవాలి. ఎవరికి కరోనా ఉన్నా, ఎవరిలో లక్షణాలు కనిపించినా ఏమాత్రం టెన్షన్ పడాల్సిన పనిలేదన్న కేంద్రం... అత్యవసరమైతే... 18005994455 టోల్ ఫ్రీ నంబరుకి కాల్ చెయ్యాలని తెలిపింది.ఇంట్లోనే ఉన్న కరోనా పేషెంట్‌కి గాలి బాగా తగిలేలా చెయ్యాలి. ప్రత్యేక బాత్‌రూమ్ ఉంచాలి. ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నవారు... కరోనా పేషెంట్‌కి సేవలు చెయ్యవచ్చు. డాక్టర్ల సలహాతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు వాడొచ్చు. వాటి కోసం స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి.

అందరూ ఆరోగ్య సేతు యాప్ వాడాలి. కరోనా పేషెంట్... తన గది నుంచి బయటకు వస్తే... మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. దగ్గినా, తుమ్మినా రుమాలు లేదా టిష్యూలను అడ్డుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని డస్ట్‌బిన్‌లో వెయ్యాలి. రోజుకు 2 లీటర్ల గోరు వెచ్చని నీళ్లు తాగాలి.

కరోనా సోకిన వారు బ్రౌన్ రైస్, గోధుమలు, చిరు ధాన్యాలు, బీన్స్, చిక్కుడు, ఓట్స్ వంటి ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, క్యారెట్, బీట్ రూట్, నిమ్మ, బత్తాయి, క్యాప్సికమ్ వాడాలి. పసుపు, అల్లం, వెల్లుల్లిని కూరల్లో చేర్చాలి. మైదా, వేపుళ్లు, జంక్‌ఫుడ్, కూల్ డ్రింక్స్, పామాయిల్, బటర్‌లకు దూరంగా ఉండాలి.

కరోనా సోకిన వారు దేన్ని ముట్టుకున్నా... వెంటనే దాన్ని శానిటైజ్ చెయ్యాలి. వైరస్ ఉన్న వాళ్లు... తమ గదిని తామే శుభ్రం చేసుకోవాలి. వేడి నీటిలో డెటాల్ వేసి... తమ బట్టల్ని అందులో అరగంట నానబెట్టి... స్వయంగా ఉతికి, స్వయంగా ఆరేసుకోవాలి. వైరస్ ఎక్కువైతే... అప్పుడు డాక్టర్లకు చెప్పాలి.

ముఖం, పెదవులు బ్లూ కలర్‌లోకి మారినా, జ్వరం బాగా ఎక్కువైనా, గుండెలో నొప్పి వచ్చినా, ఊపిరి ఆడకపోయినా డాక్టర్లకు కాల్ చెయ్యాలి. టెన్షన్ అక్కర్లేదు. కరోనా లక్షణాలున్నా ఏ టెన్షనూ వద్దు. కరోనా పేషెంట్ దగ్గరకు కుటుంబ సభ్యులు వెళ్లాలంటే... వాళ్లు ముక్కుకు... మూడు పొరలు ఉన్న మాస్క్ (N-95 లాంటిది) వాడాలి. ఆ మాస్కును వాడిన తరవాత... కాల్చివేయాలి. (తగలబెట్టాలి). పేషెంట్ గదిలోకి వెళ్లి, వచ్చాక... చేతుల్ని కడుక్కొని, శానిటైజర్ రాసుకోవాలి.పేషెంట్ కోసం వండిన ఆహారాన్ని ఆ వ్యక్తి ఉన్న గదికే పంపాలి. బాడీ ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారన్ హీట్ కంటే పెరిగితే... డాక్టర్లకు కాల్ చెయ్యాలి. రోగి వాడే పాత్రలు, వస్తువుల్ని వేడి నీటిలో 30 నిమిషాలు ఉంచి... ఆ తర్వాత కడిగి... అప్పుడు వాడుకోవచ్చు.

వైరస్ సోకిన వ్యక్తి ఇంటి పక్కనే ఉన్నా... చుట్టుపక్కల వాళ్లు టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎవరికి వాళ్లు కరోనా తమకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలంతే. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వాళ్లు బయట తిరిగితే... వారి చేతులపై ఉండే ముద్ర ఆధారంగా వాళ్లను గుర్తించి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి.

ఈ రూల్స్ మనకు కొత్తగా ఉండొచ్చు గానీ... అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో ఇదే చేస్తున్నారు. సరే అక్కడంటే... పెద్ద పెద్ద ఇళ్లుంటాయి. ఎక్కువ గదులుంటాయి కాబట్టి పాటించడం ఈజీయే. మనకో... ఉన్న ఇళ్లే ఒకట్రెండు గదులుంటాయి. ఒకటే బాత్‌రూం ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి రూల్స్ పాటించడం ఎలా సాధ్యం అన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If the coronavirus is infected, then the central government has to issue new guidelines ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0