Temporary plan to open schools in the state!
రాష్ట్రం లో పాఠశాలలు తెరిచేందుకు తాత్కాలిక ప్రణాళిక!
కరోనా కాటు నుంచి బడి పిల్లలను ఇన్నాళ్లు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఇక లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో త్వరలోనే పాఠశాలలు కూడా తెరుచుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇటు ఏపీ అటు తెలంగాణలో పాఠశాలలు ఎప్పుడూ ప్రారంభించే అవకాశం ఉందన్న విషయంలో తాత్కాలికంగా ఓ ప్రణాళికను రూపొందించాయి. అయితే పాఠశాలలు ప్రారంభించినా భౌతిక దూరం పాటించటం, చేతులు పరిశుభ్రంగా ఉంచటం వంటివి పిల్లల విషయంలో కొంచెం కష్టమైన పనే. ఇవే కాకుండా ఇతరత్ర అంశాలకు సబంధించి ఆయారాష్ట్రాల విద్యాశాఖల వ్యుహాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నెలలపాటు వెనక్కి వెళ్లిపోతోంది. కరోనా ప్రభావం...లాక్‌డౌన్ అమలు ఫలితంగా ఇప్పటికీ గత విద్యా సంవత్సరం చివర్లో జరగాల్సిన పరీక్షలు ఇంకా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అన్నింటా ఇదే ధోరణి. పదో తరగతి మినహా ఇతర పాఠశాల చదువుల్లో విద్యార్ధులకు పరీక్షల బెడద లేకుండానే పై తరగతికి ఉన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వం, ప్రయివేటు పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేయడంతో.. పదో తరగతి తప్ప ఇతర తరగతుల విద్యార్ధులు పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండానే...విద్యా సంవత్సరాన్ని ముగించేశారు.
ఆగస్టు 3 నుంచే పాఠశాలలు...!
ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ పాఠశాలను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఏపీలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను ఆగస్టు మూడో తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈలోగా పరీక్షల నిర్వహణ, ఫలితాలు పూర్తవుతాయని అంచనా వేసింది. అప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందని అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. తరగతుల నిర్వహణ సమయంలో.. ఉదయం నిర్వహించే ప్రార్థన రద్దు చేసి.. తరగతి గదిలో మైకుల ద్వారా చేయించుకోవచ్చుని పేర్కొంది. 30మంది విద్యార్థులు మించి ఉంటే ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో నిర్వహించాలని సూచించింది.
నో స్కూల్ బ్యాగ్ డే నిర్వహించాలి...
50-100మంది ఉంటే రోజు విడిచి రోజు నిర్వహించాలి. మొదటి రోజు కొందరికి రెండు విడతలు, మరుసటి రోజు రెండు విడతల్లో మరి కొందరికి తరగతులు నిర్వహించాలని సూచించింది. తాగునీరు, మధ్యాహ్న భోజనానికి విడతకు 10 మందికి మించి ఉండకూడదు. ఆటల పీరియడ్‌ను రద్దు చేయాలి. వ్యక్తిగత వ్యాయామాలు, యోగా నేర్పించవచ్చు. ‘నో స్కూల్ బ్యాగ్ డే’ నిర్వహించాలి. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరకులను అందించాలి. పరీక్షల్లో గదికి పది మంది మాత్రమే ఉండాలని పేర్కొంది.
నిపుణుల కమిటీ ఏర్పాటు...
ప్రస్తుత షెడ్యూల్ అంతా కరోనా వ్యాప్తి తీవ్రతరం కాకుండా ఉంటేనే ఇలా జరుగుతుంది. ఒకవేళ ప్రస్తుతం సడలించిన లాక్‌డౌన్ నిబంధనలు మళ్లీ అమలు చేయాల్సి వస్తే- అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సూచించేందుకు ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని వేసింది. వారి నివేదికకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది. ఈలోగా మన బడి నాడు–నేడు పేరిట 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పరంగా తొమ్మిది రకాల సదుపాయాలు సమకూర్చేందుకు కార్యాచరణ రూపొందించింది.కరోనాతో విద్యా సంవత్సరం గాడి తప్పిన తరుణంలో- మళ్లీ పట్టాల మీదకు తీసుకొచ్చేందుకు .. పరిస్థితులను బేరీజు వేసుకుంటే ప్రభుత్వ... ప్రయివేటు సంస్థలు తమదైన కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నాయి. విద్యా సంస్థలు ప్రారంభమైన తర్వాత భౌతిక దూరం..ఇతర కరోనా వ్యాప్తి నియంత్రణ మార్గదర్శాలు ఎంతవరకు ఏ మేరకు అమలవుతాయనే ఆందోళన తల్లిదండ్రుల్లోనూ... విద్యావేత్తలోనూ నెలకొనే ఉంది.
0 Response to "Temporary plan to open schools in the state!"
Post a Comment