Job recruitment exams from September 15th.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. సెప్టెంబరు 15 నుంచి ఉద్యోగ నియామక పరీక్షలు.
సెప్టెంబరు 15 నుంచి ఉద్యోగ నియామాకాలకు సంబంధించిన పరీక్షలు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది
సెప్టెంబరు 15 నుంచి ఉద్యోగ నియామాకాలకు సంబంధించిన పరీక్షలు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. దాని ఫలితంగానే అనేక రంగాలు కుంటుపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విద్య, ఉద్యోగ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సెప్టెంబరు 15 నుంచి ఉద్యోగ నియామాకాలకు సంబంధించిన పరీక్షలు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలో వాయిదా పడిన పరీక్షల తేదీల వివరాలతో ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో భాగంగానే ఏపీపీఎస్సీ అధికారులు.. నవంబరు 2 నుంచి 13 వరకు గ్రూప్ 1 ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్ష తేదీల వివరాలివే..
- సెప్టెంబరు 15, 16 తేదీల్లో డీఎల్(డిగ్రీ కాలేజీ లెక్చరర్ల) నియామక పరీక్షలు
- సెప్టెంబరు 21 నుంచి 24 వరకు గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు
- సెప్టెంబరు 21, 22 తేదీల్లో అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షలు
- సెప్టెంబరు 22న రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీస్ నియామక పరీక్ష
- సెప్టెంబరు 23న పోలీసు శాఖలోని టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక పరీక్ష
- సెప్టెంబరు 23, 24న పట్టణ ప్రణాళిక అసిస్టెంట్ విభాగంలో డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష
- సెప్టెంబరు 23, 24 తేదీల్లో ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాల నియామక పరీక్ష
- సెప్టెంబరు 23, 24 తేదీల్లో పట్టణ ప్రణాళిక విభాగంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పరీక్ష
- సెప్టెంబరు 25, 26, 27 తేదీల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు
0 Response to "Job recruitment exams from September 15th."
Post a Comment