Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Money in SBI is an eyesore profit .. double returns!

SBI లో డబ్బులు పెడితే కళ్లుచెదిరే లాభం .. రెట్టింపు రాబడి ! 
Money in SBI is an eyesore profit .. double returns!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది . బ్యాంక్ అకౌంట్ దగ్గరి నుంచి రుణాల వరకు , ఆన్లైన్ బ్యాంకింగ్ నుంచి క్రెడిట్ కార్డుల వరకు పలు రకాల సర్వీసులు ఆఫర్ చేస్తోంది . బ్యాంక్ కూడా ఇటీవల అదిరిపోయే క్యూ 4 ఆర్థిక ఫలితాలు కూడా ప్రకటించింది . బ్యాంక్ తాజాగా క్యూ 4 ( 2019-20 , జనవరి - మార్చి త్రైమాసికం ) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది . బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం రూ . 3,581 కోట్లుగా నమోదైంది . వార్షిక ప్రాతిపదికన చూస్తే బ్యాంక్ లాభం ఏకంగా 4 రెట్లు పెరిగింది . తక్కువ కేటాయింపులు , వాటా అమ్మకం ఇందుకు ప్రధాన కారణం .స్టేట్ బ్యాంక్ నికర లాభం 4 రెట్లు పెరిగినా కూడా మార్కెట్ అంచనాల కన్నా ఇది తక్కువ కావడం గమనార్హం . స్టేట్ బ్యాంక్ ఇటీవల తన అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డులో వాటా విక్రయించింది . దీని ద్వారా బ్యాంక్ కు రూ .2,731 కోట్లు లభించాయి . నికర లాభంలో ఇది కూడా భాగంగానే ఉంది . ఈ నేపథ్యంలో పలు బ్రోకరేజ్ సంస్థలు ఎస్ బీఐ షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాయి . మోతీలాల్ ఓస్వాల్ ఎస్బీఐ స్టోర్‌కు రూ .280 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది . ప్రస్తుత షేరు ధర రూ .188 తో పోలిస్తే ఇది దాదాపు 49 శాతం ఎక్కువ . అలాగే షేర్ ఖాన్ కూడా ఎస్బీఐ టార్గెట్ ధరను రూ . 262 గా పేర్కొంది . ఎస్బీఐ షేరుకు ఎంకే గ్లోబల్ టార్గెట్ ధర రూ .225 గా , ఐఐఎస్ఎల్ టార్గెట్ ధర రూ .250 గా ఉంది . అంటే ఎస్బీఐ షేరులో డబ్బులు పెడితే దాదాపు రెట్టింపు లాభం పొందొచ్చు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Money in SBI is an eyesore profit .. double returns!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0