Rc No: SS-16021 dt: 1-6-20 Jagananna Vidyakanuka About Student's Foot Dimensions for Delivering Kits and Shoes to Students.
Rc No: SS-16021 dt: 1-6-20 Jagananna Vidyakanuka About Student's Foot Dimensions for Delivering Kits and Shoes to Students.
- బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించాల్సిన సూచనలు
- రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్/ మున్సిపల్/ కేజీబీవీ, మోడల్ స్కూల్స్/ ఆశ్రమ, రెసిడెన్షియల్/ ఎయిడెడ్ పాఠశాల్లో ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి.
- ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు/ వ్యాయామ ఉపాధ్యాయులు/ పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లు, స్థానికంగా ఉన్న సిబ్బంది బాధ్యత తీసుకోవాలి.
- ఈ బాధ్యత నిర్వహించినందుకు సంబంధిత ఉపాధ్యాయునికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది.
- ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు.
- విద్యార్థుల పాదాల కొలతలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయుట. ఈ బాధ్యతను సీఆర్పీలకు అప్పగించడమైనది.
- ముఖ్యంగా చేయవలసినవి
- విద్యార్ధులపాదాల కొలతలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవలసిన అంశము.. తర్వాతి సంవత్సరానికి అనుగుణంగా (వారి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని) పాదాల కొలత సైజును పెంచి తీసుకోవాలి.
- (:: ఉదాహరణకు ఒక విద్యార్థి పాదం ప్రస్తుత సైజు 5 ఇంచీలు ఉంటే కాస్త పెంచి 6 ఇంచీలు సైజుగా నమోదు చేయాలి.)
- ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి తమ పాఠశాల విద్యార్థులను 8.6.2020 మరియు 9.6.2020 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలకు రప్పించాలి.
- విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు కోవిడ్- 19 ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా ఆచరిస్తూ భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్, హేండ్ వాష్ వంటివి తప్పక వినియోగించి తగు జాగ్రత్తలు వహించాలి.
- పాఠశాలకు రాలేని పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్థుల, కేజీబీవీ/ మోడల్ స్కూల్స్/ ఆశ్రమ/ రెసిడెన్షియల్ తదితర హాస్టల్లో చదివే బాలబాలికల పాదాల కొలతలు తీసుకోవడానికి జగనన్న గోరుముద్ద పథకం (మధ్యాహ్నభోజనం)లో భాగంగా విద్యార్థులకు డైరేషన్ (బియ్యం, చిక్కీ, గుడ్లు) అందిస్తున్న వాలంటీర్ల సాయం తీసుకొని, ఆ విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేలా సీఆర్పీలు చర్యలు తీసుకోవాలి.
0 Response to "Rc No: SS-16021 dt: 1-6-20 Jagananna Vidyakanuka About Student's Foot Dimensions for Delivering Kits and Shoes to Students."
Post a Comment