Salaries delayed for the month of June
మండలి రగడతో జూన్ నెల జీతాలు ఆలస్యం.
ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లలో ఆందోళన.
ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లలో ఆందోళన.
అమరావతి , ఆంధ్రప్రభ : ప్రతినెలా క్రమం తప్పకుండా 1 వ తేదీకి ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్ల ఖాతాలో పింఛన్ జమ కావడం ఇప్పటి వరకు ఆనవాయితీ వస్తోంది . అయితే జూన్ నెల జీతాలు జూలై 1 వ తేదీకి కాకుండా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం . ప్రధానంగా మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడమే జీతాలు ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు . ఈ ఏడాది మార్చి నెలలో జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కరోనా కారణంగా ఓటాన్ ఎకౌంట్ కు పరిమితమయ్యాయి . జూన్ నెలాఖరుకు ఓటాన్ ఎకౌంట్ గడువు ముగియనుండటంతో ఈ నెల 15 , 16 వ తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది . పూర్తి స్థాయి బడ్జెట్ కోసమే ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు . ఈ నెల 15 వ తేదీ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టి సభ్యుల ఆమోదం పొందింది . రాష్ట్రంలో తొలిసారిగా బడ్జెట్ పై చర్చ లేకుండానే మండలికి బిల్లును పంపారు . ఈ నెల 16 నమండలిలో బడ్జెట్ కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది . అయితే మండలిలో అధికార వైకాపా , విపక్ష తెదేపాల మధ్య వివాదం కారణంగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండానే , అర్ధాంతరంగా సభ నిర్వధికంగా వాయిదా పడింది . రాష్ట్ర చరిత్రలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవటం ఇదే తొలిసారి కావడం శోచనీయం . దీనిపై అధికార , విపక్ష పార్టీల నేతలు పరస్పరం విమర్శలు సందించుకోవడం జరిగింది . ఈ నేపథ్యంలో మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఆమోద ముద్ర పడకపోవడంతో జూన్ నెలకు సంబంధించి ఉద్యోగుల జీతాలు , పెన్షన్లు , ఆర్ధిక బిల్లుల చెల్లింపులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి . ఇలాంటి పరిణామాల నేపధ్యంలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించుకొనే అకాశం ఉంది . అయితే రాష్ట్రంలో ఆర్డినెన్స్ లేకుండానే బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఏర్పడింది . ఈ నెల 16 న అసెంబ్లీలో బడ్జెట్ కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది . దిగువ సభలో ఆమోదం పొందకపోయిన బిల్లు 15 రోజుల్లో యధాతదంగా ఆమోదం పొందుతుంది . దీనిబట్టి చూస్తే వచ్చే నెలా 1 వ తేదీ నాటికి ఈ 15 పూర్తి అయ్యి బిల్లు ఆమోద ముద్ర పొందుతుంది . దీంతో 2 వ తేదీన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు , పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పించన్లు వారి ఖాతాల్లో జమ కావచ్చని భావిస్తున్నారు . అదే విధంగా ప్రతి నెలా 1 వ తేదీ వాలంటీర్ల ద్వారా నేరుగా అందించే సామాజిక భద్రత పించన్లు కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయని అధికార యంత్రాంగం చెబుతోంది . అలాగే ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న బిల్లులు కూడా , కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి . ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు , పెన్షనర్లు ముందస్తు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది .
మూలం:ఆంధ్రప్రభ
మూలం:ఆంధ్రప్రభ
0 Response to "Salaries delayed for the month of June"
Post a Comment