Talk about Zero Year (Zero Year)
శూన్య విద్యా(జీరో ఇయర్) సంవత్సరం పై చర్చ
మామూలు రోజుల్లోనే పాఠశాలలకు వెళ్లి వచ్చే పిల్లలు అక్కడి పరిస్థితుల వల్ల రకరకాల అనారోగ్యాలకు గురవుతుంటారు. అలాంటిది *కరోనా సమయంలో వాళ్లను పంపేదెలాగన్న ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.
మామూలు రోజుల్లోనే పాఠశాలలకు వెళ్లి వచ్చే పిల్లలు అక్కడి పరిస్థితుల వల్ల రకరకాల అనారోగ్యాలకు గురవుతుంటారు. అలాంటిది *కరోనా సమయంలో వాళ్లను పంపేదెలాగన్న ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.
- ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ తెరవొచ్చని కేంద్రం చెప్పినా. ప్రస్తుతం కేసుల విస్తృతి చూస్తుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు.
- నవంబరు నాటికి కరోనా కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకోవచ్చని, ఆ సమయంలో ఐసొలేషన్ వార్డులు, వెంటిలేటర్లకు కొరత రావొచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఏర్పాటుచేసిన ‘ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూపు’ అభిప్రాయపడింది.
- రాష్ట్రంలో ఇప్పటికే పదోతరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. డిగ్రీ, పీజీ, బీటెక్ పరీక్షలపైనా సమాలోచనలు జరుగుతున్నాయి.
- ఈ నేపథ్యంలో.. శూన్య విద్యా సంవత్సరం (జీరో అకడమిక్ ఇయర్)పై జాతీయస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. దిల్లీ లాంటి నగరాల్లో కొందరు ఉపాధ్యాయులు కూడా పెద్దసంఖ్యలో కరోనా బారిన పడ్డారు.
- ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పట్లో స్కూళ్లు తెరిచేందుకు హడావుడి వద్దని, వీలైతే ఈ విద్యా సంవత్సరాన్ని శూన్య సంవత్సరంగా ప్రకటించాలని తల్లిదండ్రుల సంఘాలు డిమాండుచేస్తున్నాయి.
- ఇటీవలే దిల్లీలో విద్యాహక్కు ఉద్యమకారులు, తల్లిదండ్రుల సంఘాలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాలు దీనిపై చర్చించాయి.
- ఎక్కువమంది 2020-21ని శూన్య విద్యా సంవత్సరంగా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.
- సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్ లేదా టీవీలు / యూట్యూబ్ ఛానళ్ల ద్వారా బోధన కొనసాగించి.. పరీక్షలు, గ్రేడ్లు లేకుండానే పిల్లలను పై తరగతులకు పంపాలన్నది వీరి అభిప్రాయం.
- పూర్తిగా శూన్య విద్యా సంవత్సరాన్నే అమలుచేస్తే మాత్రం పిల్లలు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.
- ఒకవేళ ఆగస్టులో పాఠశాలలు తెరిచినా.. తమ పిల్లల్ని పాఠశాలలకు పంపేందుకు ఎంతమంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉంటారనేది అనుమానంగానే కనిపిస్తోంది.
- చాలామంది కొత్త కరోనా కేసులు రావడం ఆగిపోతేనే పంపిస్తామంటున్నారు. ఇంకొంతమంది టీకా, మందు వచ్చిన తర్వాత తెరిస్తేనే మేలని అంటున్నారు
0 Response to "Talk about Zero Year (Zero Year)"
Post a Comment