Modi Real Estate Scheme! Rent for the month is only Rs 1,000
Modi హౌసింగ్ స్కీమ్ ! నెలకు అద్దె రూ.1,000 మాత్రమే?
వలస కూలీలు, కార్మికులు పట్టణాల్లో రూమ్ రెంట్‌కు తీసుకొని జీవించడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఇంటి అద్దె ఎక్కువగా ఉంటుంది. వచ్చే కూలీ డబ్బులు రెంట్‌కు సరిపోవచ్చు. అయితే ఇప్పుడు వీరి కోసం కేంద్రం కొత్త స్కీమ్ తీసుకువస్తోంది.
కేంద్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్‌ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. వర్కర్లు, కూలీలు, వలస కార్మికులు వంటి వారికి ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ వీరి కోసం త్వరలోనే రెంటల్ హౌసింగ్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. విద్యార్థులు కూడా ఈ పథకం వల్ల ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రెంటల్ హౌసింగ్ స్కీమ్ ద్వారా తక్కువ అద్దెకే రూమ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇంటి అద్దె రూ.1,000 నుంచి ప్రారంభం కావొచ్చు. గరిష్టంగా రూ.3,000 వరకు ఉండొచ్చు. అయితే ఈ రెంట్ అంశంపై అంతిమ నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పటికి అయితే అధికారికంగా ఈ విషయం వెల్లడికాలేదు. హౌసింగ్ మినిస్ట్రీ ఇప్పటికే ఈ స్కీమ్ కోసం తొలి విడత కింద రూ.700 కోట్లను కేటాయించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 14న ఈ స్కీమ్‌కు సంబంధించి ప్రకటన చేశారు. యూపీఏ ప్రభుత్వం కూడా రాజీవ్ ఆవాస్ యోజన, జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ అనే రెండు స్కీమ్‌ను అందించేది. వీటి స్థానంలో కొత్త స్కీమ్‌ను తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తోంది.
నివేదిక ప్రకారం చూస్తే.. రూరల్ రెంట్ స్కీమ్‌కు సంబంధించి కేబినెట్ నోట్ కూడా రెడీ అయ్యింది. దీనికి హౌసింగ్ మినిస్ట్రీ ఆమోదం కూడా తెలిపింది. అయితే ఇప్పుడు ఇది కేబినెట్ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. ఇకపోతే ఈ స్కీమ్ కింద ఇళ్లు నిర్మించే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు కూడా అందించనుంది.
కాగా కేంద్ర ప్రభుత్వం రెంటల్ హౌసింగ్ స్కీమ్ కింద పీపీపీ మోడల్ కింద ఇల్లను నిర్మించనుంది. వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రాజెక్ట్‌ను తయారు చేయొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. తొలి దశలో దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో 75000 వరకు ఇళ్లను నిర్మించే ఛాన్స్ ఉంది.
0 Response to "Modi Real Estate Scheme! Rent for the month is only Rs 1,000"
Post a Comment