Movement in Teacher Transfers Exercise for Rationalization
టీచర్ల బదిలీల్లో కదలిక
రేషనలైజేషన్‌కు కసరత్తు
వచ్చే నెల 10 నుంచి ప్రక్రియ ప్రారంభం
ఆగస్టు 3 నాటికి పూర్తి
రేషనలైజేషన్‌కు కసరత్తు
వచ్చే నెల 10 నుంచి ప్రక్రియ ప్రారంభం
ఆగస్టు 3 నాటికి పూర్తి
ఉపాధ్యాయుల బదిలీల్లో కదలిక మొదలైంది. అందుకు అవసరమైన కసరత్తును యంత్రాంగం ప్రారంభించింది. ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియపై దృష్టి సారించింది. బదిలీల కోసం గత రెండేళ్లుగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. గతేడాది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరోనా నేపఽథ్యంలో వెబ్ ద్వారా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
బదిలీల ప్రక్రియను జూలై 15 తర్వాత చేపట్టి, ఆగస్టు 3నాటికి పూర్తిచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో పాఠశాలలు ఆగస్టు 3 నుంచి పునఃప్రారంభం కానున్న విషయం విదితమే. అప్పటికి బదిలీ అయిన టీచర్లు కొత్త పాఠశాలల్లో చేరేలా కార్యాచరణను రూపొందించింది. అయితే బదిలీలకు సంబంధించి గతంలో ఉన్న వ్యక్తిగత పనితీరు పాయింట్లను తొలగించి కేవలం ఉపాధ్యాయుల సర్వీసు సీనియారిటీ, స్టేషన్ సీనియారిటీలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు.
టీచర్ల హేతుబద్ధీకరణకు కసరత్తు
విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించే ముందు తప్పనిసరిగా హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) నిర్వహించాల్సి ఉంది. ఈ నేపఽథ్యంలో పాఠశాలల్లో ఈ ఏడాది జూన్ 1 నాటికి ఉన్న విద్యార్ధుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ సేకరిస్తుంది.
జూన్1 నాటికి పాఠశాలల్లో 1 నుంచి 10వతరగతి వరకు ఉన్న సెక్షన్లు వారీగా ఇంగ్లీషు, తెలుగు మీడియంలో విద్యార్థుల వివరాలను ఎంఈఓలను, హైస్కూలు హెచ్‌ఎంలను కోరారు. అదేవిధంగా జూన్1 నాటికి పాఠశాలలకు మంజూరైన అన్ని కేటగిరీల్లోని ఉపాధ్యాయుల పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, ఆ పోస్టులు ఏతేదీ నుంచి ఎందుకు ఖాళీగా ఉన్నాయో కోరారు.
ఈ వివరాలను పాఠశాలల యాజమాన్యం (ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత) పాఠశాలల వివరాలు కోరారు.
ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను పాఠశాల పేరు, ఏ కేటగిరీలో ఉంది, ఆ ఉపాధ్యాయుడు పుట్టిన తేదీ. సర్వీసులో చేరిన తేదీ, ఈనెల 30నాటికి ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో ఎన్నేళ్లు పూర్తయింది తదితర వివరాలు కోరారు. ఈ వివరాలు సిద్ధం చేసుకుంటే యుడైస్ ఛైల్డ్ ఇన్‌పోలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని టీచర్లను సర్దుబాటు చేస్తారు.
విద్యాశాఖ ఈ వివరాలు సిద్ధం చేసుకుంటే ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాలు ప్రకారం రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
0 Response to "Movement in Teacher Transfers Exercise for Rationalization"
Post a Comment