Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Review of Five-Day Workdays.

అయిదు రోజుల పనిదినాలపై సమీక్ష మరల ఏడాది పొడిగిస్తారా .. ? 
Review of Five-Day Workdays.

అమరావతి , ఆంధ్రప్రభ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాలనా వికేంద్రీకరణ , సీఆర్ డీఏ రద్దు బిల్లులు ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టే ఏకగ్రీవ ఆమోదం పొందిన నేపథ్యంలో పరిపాలన రాజధాని విశాఖపట్టణంకు మార్చే విషయమై చర్చలు ఊపందుకున్నాయి . మండలిలో చర్చకు రాకపోయినా కొద్ది రోజుల్లో ఈ రెండు బిల్లులు పాసయ్యే అవకశాలు ఉన్నాయి . ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాలనలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి . ఇప్పటివరకు అమరావతి కేంద్రంగా పనిచేసిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను వివిధ ప్రాంతాలకు మార్చేందుకు కసరత్తు ప్రారంభమైంది . ఇదే సమయంలో ఉద్యోగులకు గతంలో ఇచ్చిన అయిదు పనిదినాల ఆప్షన్ నుకూడా ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉంది . ఈ ఆప్షన్‌ను ఇప్పటికే ఒక సారి పొడిగించిన జగన్ సర్కార్ ఈ సారి ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారింది . అయిదురోజుల పనిదినాలతో ప్రభుత్వ కార్యాకలాపాలు కుంటుపడినట్టుగా భావిస్తున్నారు . ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలకు కేంద్రబిందువుగా ఉండే సచివాలయంతో పాటు అమరావతిలోని హెచ్ వోడి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అప్పటి పరిస్థితుల ఆధారంగా అయిదు రోజుల పనిదినాలు కల్పించారు . సోమవారం ఉదయం 11 గంటలకు విధుల్లోకి వచ్చి శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ కు వెళ్ళటం వల్ల సచివాలయంలో పని బాగా కుంటుపడిందనీ , ఫైళ్ళు పెండింగ్ పడుతున్నాయని భావిస్తున్నారు . వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వారానికి అయిదురోజుల పనిదినాలను పొడిగించారు . అయితే , రాజధాని అమరావతిలోనే ఉన్నా , విశాఖకు వెళ్ళినా కొద్దికాలం ఉద్యోగుల రాకపోకలు తప్పనిసరి . ఈ నేపథ్యంలో మరో ఏడాదిపాటు అయిదు రోజుల పనిదినాన్ని పొడిగించే అవకాశం కూడా లేకపోలేదని భావిస్తున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Review of Five-Day Workdays."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0