Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teachers adjust based on admissions

మీ ఊళ్లో పాఠశాల పదిలం!
ప్రవేశాల ఆధారంగా ఉపాధ్యాయులే సర్దుబాటు
రేషనలైజేషన్‌ ప్రక్రియపై స్పష్టత

సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పిల్లల సంఖ్య ఆధారంగా సర్దుబాటు (రేషనలైజేషన్‌) చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ నిర్వహణ చేపట్టాలని వారం క్రితం ఆదేశించటం తప్ప అందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడించలేదు. తాజాగా ఈ ప్రక్రియ నిర్వహణకు కొన్ని విధి విధానాలను రూపొందించి పిల్లల ప్రవేశాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారా? ఇంకేమైనా మిగులు ఉన్నారా అనేది గుర్తించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లోనే ప్రవేశాలు తక్కువగా ఉండటంతో రేషనలైజేషన్‌ వీటిల్లోనే నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు బోధించే ప్రాథమిక, ప్రాథమికోన్నత, మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లతో పాటు స్కూల్‌ అసిస్టెంట్లు, పండితులు విద్యార్థులకు ఆయా సబ్జెక్టులు బోధిస్తున్నారు. ప్రస్తుతం పిల్లల ప్రవేశాలకు అనుగుణంగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించగానే టీచర్ల బదిలీలు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మిగులు ఉపాధ్యాయుల లెక్కలు తేల్చాలని పాఠశాల విద్యాశాఖ సూచించటంతో జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు ఆ కసరత్తులో నిమగ్నమయ్యారు. రేషనలైజేషన్‌ అనగానే ఉపాధ్యాయుల్లో ఒకటే ఆందోళన, ఉత్కంఠ నెలకొంది. పిల్లలు లేరని తమను తీసుకెళ్లి ఎక్కడ వేస్తారో.. తమ పోస్టులను ఏ పాఠశాలలో విలీనం చేస్తారోనని అక్కడ తాము జూనియర్లుగా ఉండాల్సి ఉంటుందని మదనపడుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం రేషన్‌లైజేషన్‌లో భాగంగా పిల్లలు లేరని ఏ పాఠశాలను మూసివేయటం ఉండదని వాటిని బలోపేతం చేసే దిశగా చర్యలు ఉంటాయని చెప్పటంతో కొంతవరకు ఉత్కంఠ వీడినట్లైంది.

గ్రామ నేతలకు ఊరట

రేషనలైజేషన్‌లో భాగంగా పిల్లలు తగ్గిన పాఠశాలలను మూసివేసి వారు ఉన్న చోట్ల విలీనం చేస్తారనే ఆలోచనతో గ్రామాల్లో నేతలు ఆందోళన చెందుతున్నారు. ఊరికి రెండు, మూడు పాఠశాలల చొప్పున ఉన్నాయి. మా కాలనీలో బడి మూయవద్దంటే మాది మూయవద్దని ఎవరికి వారు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావటం సహజం. ఈ గందరగోళానికి తావు లేకుండా ప్రభుత్వం 10 మందికి కన్నా తక్కువ ఉన్న పాఠశాలలను మాత్రమే మూసేస్తామని అంతకు మించి ప్రవేశాలు ఉన్నవి కొనసాగిస్తామని స్పష్టం చేసింది. పిల్లల ప్రవేశాల ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయటం మినహా పాఠశాలలను మూసివేసే పరిస్థితి ఉండదంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు 2320 ఉన్నాయి. వీటిల్లో పిల్లల ప్రవేశాలు, పనిచేస్తున్న టీచర్ల లెక్కలు తీసి నాలుగైదు రోజుల్లో రేషనలైజేషన్‌ ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలనే యోచనలో ఉన్నామని జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Teachers adjust based on admissions"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0