These are the tasks that teachers attending school should do
పాఠశాల కు హాజరయ్యే ఉపాద్యాయులు చేయవలసిన విధులు ఇవే
		
			
సర్కారు బడులకు విచ్చే స్తున్న ఉపాధ్యాయుల విధులను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిందని 2020-21 విద్యాసంవ త్సరం జూన్ 16 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా పాఠశాలలు తెరవలేని పరిస్థితి ఉందన్నారు . ప్రస్తుతం ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు వచ్చి నిర్వర్తించాల్సిన విధులను వెల్లడించారు . 
ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన విధులు- ఉపాధ్యాయులకు ప్రతి రోజూ బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి
 - గత సంవత్సరం పిల్లల హాజరును లెక్కించి ప్రమోషన్ నివేదికలు తయారు చేయాలి
 - విద్యార్థుల మార్కులను రిజిస్టర్లలో నమోదు చేసి తరువాత విద్యాశాఖ వెబ్ సైట్ లో నమోదు చేయాలి .
 - విద్యాశాఖ వెబ్ సైట్ లో ఉపాధ్యాయుల వివరాలు , గత విద్యా సంవత్సరం యూడైస్ వ్యత్యాసాలను సరి చేయాలి .
 - " పాఠశాల ప్రారంభం నాటికి కోవిడను దృష్టిలో ఉం చుకుని తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రణాళిక లను సిద్ధం చేయాలి .
 - 2020-21 విద్యాసంవత్సరం అన్ని తరగతులకు వార్షిక ప్రణాళిక , పాఠ్యప్రణాళిక , బోధనాభ్యాస సామగ్రి , కిట్లు తదితరాలను తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలి .
 - పాఠశాలలో జరుగుతున్న నాడు - నేడు పనులను త్వరితగతిన , నాణ్యంగా పూర్తి చేయడానికి సహకరించాలి .
 - మూడు నెలలుగా పాఠశాలలు మూతపడినందున లైబ్రరీలు , ల్యాబ్ లను శుభ్రం చేయించుకోవాలి.
 - ఉపాధ్యాయుల సర్వీసు వివరాలు ఈఎస్ఆర్ లో అప్ లోడ్ చేయాలి .
 - ప్రతి రోజూ దూరదర్శన్ లో ప్రసారమవుతున్న 1-9 తరగతులకు బ్రిడ్జి కోర్సు , పదో తరగతికి వెళ్లిన విద్యార్థుల కోసం ప్రసారమవుతున్న రెగ్యులర్ సిలబస్ పాఠాలపై తల్లి దండ్రులకు సమాచారం అందించి విద్యార్థులు చూసేలా తగు చర్యలు చేపట్టాలి .
 



0 Response to "These are the tasks that teachers attending school should do"
Post a Comment