This is a decision not to fall behind in the ranks of the NEETHI AYOGYA
- నీతి ఆయోగ్ ర్యాంకులో వెనుకబడకూడదనే ఈ నిర్ణయం
- స్కూళ్లకు టీచర్ల హాజరు ఉత్తర్వుపై కమిషనర్ చినవీరభద్రుడు గారు
సాక్షి , అమరావతి : రాష్ట్రంలో విద్యా ర్థుల సమాచారానికి సంబంధించి ఏకీకృత జిల్లా పాఠశాల విద్య సమా చార వ్యవస్థ ( యూడైస్- యూని ఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ) డేటాను పూర్తిస్థాయిలో అప్ డేట్ చేయాల్సి ఉన్నందున ప్రభు త్వ పాఠశాలల హెడ్మాస్టర్లు , టీచర్లు , ఇతర సిబ్బంది తప్పనిసరిగా స్కూళ్లకు హాజరు కావాలని ఉత్తర్వులు ఇచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభ ద్రుడు తెలిపారు . " అనేక ప్రమాణాల ఆధారంగా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు ర్యాంకులు నిర్ణయిస్తుంది . ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన యూడైస్ సహా అనేక అంశాలు కేంద్ర పోర్టల్ లో అప్ లోడ్ కానం దున నీతి ఆయోగ్ ర్యాంకుల్లో రాష్ట్రానికి నష్టం జర గరాదని భావించి .. ఈ కార్యక్రమాలు నిర్వర్తిం చేందుకు టీచర్లను స్కూళ్లకు హాజరుకావాలన్న ఉత్త ర్వులు ఇచ్చాం " అని వివరించారు . విద్యాశాఖతో పాటు తమ స్కూళ్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టు కొని టీచర్లంతా దీనికి సహకారం అందించాల న్నారు . వైఎస్సాఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు కె.జాలిరెడ్డి , జి.సుధీర్ గురువారం ఆయ న్ను కలసి ఈ నెల 22 న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేయాలని కోరారు . బయోమెట్రిక్ తీసివేయడంపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు సంఘం నేతలు తెలిపారు . పాఠశాలల్లో యూడైస్ డేటాతో పాటు వివిధ తరగతుల మార్కు లను సీఎస్ ఈ పోర్టల్ లో పది రోజుల్లో అప్ డేట్ చే యించి తదుపరి పాఠశాలలకు నూతన విద్యా సం వత్సరం ప్రారంభం వరకు మినహాయింపు ఇస్తా మని కమిషనర్ పేర్కొన్నట్లు వారు వివరించారు .
0 Response to "This is a decision not to fall behind in the ranks of the NEETHI AYOGYA"
Post a Comment