Academic plan with technology
టెక్నాలజీ తో అకడమిక్ ప్లాన్
హైటెక్ , లో టెక్ , నో టెక్ వ్యూహాలతో బోధన
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు గారు
హైటెక్ , లో టెక్ , నో టెక్ వ్యూహాలతో బోధన
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు గారు
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ , అకడమిక్ ప్లాన్ , నాడు- నేడు పనుల పూర్తి తదితర అంశాల్లో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది . పాఠశాలల నిర్వహణలో సాంకేతికతను జోడిస్తూ పలు మార్పులు , చేర్పులకు శ్రీకారం చుడుతోంది . రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండటంతో విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నా యి . ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే వరకు విద్యార్ధులకు ఆన్లైన్ ద్వారా బ్రిడ్జి కోర్సులు కొనసాగించాలని నిర్ణయించింది . ఈ మేరకు పలు అంశాలతో సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు విడుదల చేశారు . క రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరతిగతిన యూడైస్ డేటానమోదు ప్రక్రియ పూర్తి చేయాలని , ఈ నెల పదో తేదీలోగా పూర్తి కావాలని సూచించారు . అలాగే కరోనా కేసులు అన్ని చోట్ల బయట పడుతుండటంతో పనిదినాలను కుదిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది . ఈ నెల 18 వ తేదీ నుంచి ప్రాథమిక స్థాయిలో ఒక రోజు , ప్రాథమికోన్నత , ఉన్నత స్థాయి పాఠశాలల్లో రెండు రోజులు ఉపాధ్యాయులు హాజరు కావాలని ఆదేశించింది .
హైటెక్ , లో టెక్ , నో టెక్ వ్యూహాలతో బోధన
విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉండటంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన కోసం మూడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు . హైటెక్ , లోటెక్ , నోటెక్ పేరుతో బ్రిడ్జి కోర్సుల నిర్వహణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు .
పాఠశాలలు పూర్తి స్థాయిలో తెరుచునే వరకు ప్రతి వారం ఈ బ్రిడ్జి కోర్సు ద్వారా ఇచ్చిన మెటీరి యల్ ను విద్యార్ధులు పక్కాగా ఫాలో అవుతు న్నారో లేదో ఎప్పటికప్పుడు ఉపాధ్యా యులు పరిశీలన చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది . స్మార్ట్ ఫోన్ , ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వారికి ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాలు బోధిం చేలా హైటెక్ బోధన ఉంటుంది . ఆ అవకాశం లేని వాళ్లకు దూర దర్శన్ , ఎస్ఎం రేడియో తదితరాల ద్వారా బ్రిడ్జి కోర్సు పాఠ్యాంశాలు బోధించ డాన్నిలో టెక్ గా వ్యవహరించను న్నారు . ఎటువంటి సాంకేతిక పరికరాలు అందు బాటులో లేని వారికోసం నోటెక్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు . కంప్యూటర్ , నెట్ , ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఉన్న విద్యార్థులతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సి ఉంటుంది . ప్రతి ఉపాధ్యాయుడు 10 నుంచి 20 మంది విద్యార్థులతో నిరంతరం టచ్ లో ఉండి , వారికి తగిన సూచనలు చేయాల్సి ఉంటుంది . ఈ మేరకు జిల్లాల విద్యాశాఖాధి కారులు , రీజినల్ జాయింట్ డైరెక్టర్లు పాఠశాలల నిర్వహణపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో కమిషనర్ పేర్కొన్నారు .
0 Response to "Academic plan with technology"
Post a Comment